అమరావతి జూలై 3 ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి వారి ఇంట్లో పని మనిషి కి కూడా కరోనా సోకింది. విజయవాడకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీలకు కరోనా సోకినట్లు గా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. రాజమండ్రి ఎంపీ భరత్ గన్మెన్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ కు కూడా కరోనా సోకినట్లు నేడు వెల్లడైంది.తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత నాలుగైదు రోజులు గా రోజు కు 700 కు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రం లో ఇప్పటి వరకు దాదాపు 16వేల కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణం గా ఏపీ లో మరణాల సంఖ్య 193 కంటే ఎక్కువ గా ఉంది. లాక్ డౌన్ ప్రారంభమైన 100 రోజులు పూర్తయింది. మహారాష్ట్ర లో దాదాపు రెండు లక్ష కేసులు నమోదు కాగా తమిళనాడు ఢిల్లీల లో లక్ష సమీపానికి వచ్చాయి.కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 520600కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కోటి కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇందు లో 60 లక్షల మంది రికవరీ అయ్యారు. మన దేశం విషయానికి వస్తే 618394 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఒక్క రోజే 13వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 18 వేలు దాటింది. ఈ రోజు ఒక్క రోజు 241 మంది మృతి చెందారు. కరోనా కేసుల్లో అమెరికా బ్రెజిల్ రష్యా తర్వాత భారత్ నాలుగో స్థానం లో ఉంది. త్వరలో రష్యాను దాటి పోయే అవకాశం కనిపిస్తోంది.