YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మందకొడిగా స్టాక్ మార్కెట్లు

మందకొడిగా స్టాక్ మార్కెట్లు

 స్టాక్‌ మార్కెట్లు మందకొడిగా ప్రారంభమయ్యాయి. అయిదు రోజుల పాటు లాభాలు గడించిన మార్కెట్లు ప్రస్తుతానికి నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రభావంతో ముడి చమురు ధరలు పెరగడంతో సూచీలు మందగమనం దిశగా కదులుతున్నాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనత కూడా తోడైంది. ఉదయం ప్రారంభంతోనే సెన్సెక్స్‌ 7 పాయింట్లు కోల్పోయి 33,932 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ కూడా ఆరంభంలోనే 19 పాయింట్ల కోల్పోయి 10,397 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం స్వల్ప లాభాలతోనే కొనసాగుతుండటం శుభపరిణామం. సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 34,000 వద్ద కొనసాగుతుంది. 11 పాయింట్ల స్వల్ప లాభంతో 10,427.50 వద్ద నిఫ్టీ కొనసాగుతుంది.ఐటీ షేర్లు మాత్రం బుధవారం నాటి జోరునే కొనసాగిస్తున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ తదితర కంపెనీల షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి. కోల్‌ ఇండియా, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, రెడ్డీస్‌ ల్యాబ్స్‌తోపాటు ఇతర సంస్థలతోపాటు 20 సంస్థల షేర్లు 52 వారాల కనిష్ఠ స్ఠాయికి దిగజారాయి. 

Related Posts