న్యూ ఢిల్లీ జులై 3 ఇన్నాళ్లు సైన్యంలో మగవారినే తీసుకునేవారు. కానీ అబలలు రంగ ప్రవేశం చేసి భారత రక్షణ రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. అయితే ఇప్పుడు అటు ఆడ కానీ.. మగ కానీ ట్రాన్స్ జెండర్లను కూడా భారత బలగాల్లోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందట..తాజాగా ట్రాన్స్ జెండర్లను పారా మిలటరీ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్లుగా నియమించే అంశంపై వైఖరి ఏంటో తెలుపాలని సీఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోంశాఖ కోరింది.ఐటీబీపీ బీఎస్ఎఫ్ సీఆర్పీఎఫ్ ఎస్ఎస్బీ విభాగాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించడంపై కేంద్రం చాన్నాళ్ల నుంచి ఆలోచిస్తోంది.తాజాగా సీఏపీఎఫ్ లను దీనిపై వివరణ కోరింది.భారత ఆర్మీలోకి 1986-87లో మహిళలు చేరినప్పుడు ఇలాంటి సమస్యలే వచ్చాయి. కానీ శారీరకంగా ఫిట్ గా ఉంటే చాలని.. లింగభేదం సమస్యే కాదని భారత మహిళా సైనికులు నిరూపించారు. పాకిస్తాన్ చైనా బార్డర్ లో వారు టెర్రరిస్టులపై పోరాడారు. ఇప్పుడు ట్రాన్స్ జెండర్లపై కూడా అపోహలు తొలగించేందుకు కేంద్రం నడుంబిగిస్తోంది.