YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ ముందుకు సాగాలి .ప్రజల మన్ననలు పొందేలా సేవలందించాలి సిపి వి సత్యనారాయణ

సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ ముందుకు సాగాలి .ప్రజల మన్ననలు పొందేలా సేవలందించాలి సిపి వి  సత్యనారాయణ

కమాన్ పూర్ జూలై 3  కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో 68 సిసి కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ను రామగుండం పోలీస్ కమీషనర్  వి.సత్యనారాయణ, పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధు శుక్రవారం ప్రారంభించారు. కమాన్ పూర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని  గ్రామాలలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేసారు.   సిసి కెమెరాల ఏర్పాటు కు కృషి చేసిన  అధికారులను, దాతలను  అభినందించారు. అనంతరం సీపీ   మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ అవుతూ వారితో మమేకం కావడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. దేశంలో తెలంగాణ పోలీస్ శాఖ అగ్రభాగంలో ఉన్నదని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని స్థాయిలో వినియోగించుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజలతో మమేకం అవుతూ సత్వర న్యాయం అందించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సిసి కెమెరాల ఏర్పాటు సాంప్రదాయం పట్టణ ప్రాంతాలకే పరిమితంగా ఉండేదని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల చైతన్యంతో ఏర్పాటు చేయడం అభివృద్ధికి నిదర్శనంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మారుమూల గ్రామం లోని ప్రజలు గ్రామ లోని సీసీ కెమెరాల స్థాపనకు  స్వచ్చందంగా ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు. గ్రామం లోని శాంతి భద్రతల విషయం లో, నేరాల చెదనలో, నేర నియంత్రణకు సీసీకెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని,సిసి కెమెరాలతో నేరాలను ఛేదించడంతో పాటు నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవడానికి సులభ మార్గాలని అభిప్రాయపడ్డారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని, జిల్లా లోని ఇతర గ్రామాలలోని ప్రజలు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని సీసీ కెమెరాల స్థాపనకు ముందుకు రావాలని కోరారు.సిసి కెమెరాలో ఒక్క సారి రికార్డ్ అవుతే దానిని మార్చలేం అన్నారు. సిసి కెమెరాల ద్వారా చాలా నేరాలను ఛేదించడం జరిగింది నేరాలు అదుపులోకి రావడం జరిగింది  అన్నారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదుదారుడు, ప్రజలకు సముచిత గౌరవం ఇచ్చి వారి సమస్యలను తెలుసుకోవాలని ముఖ్యంగా పోలీస్ శాఖ పట్ల గౌరవం, నమ్మకం పెంపొందేలా పనితీరు ఉండాలన్నారు. హోమ్ గార్డు స్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమని సిపి సత్యనారాయణ అన్నారు.విధి నిర్వహణతో పాటు సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వహిస్తూ ప్రజలకు చేరువ కావాలని తెలిపారు. సిసి కెమెరా ల ఏర్పాటు కు సహాయం చేసిన దాతలను శాలువా తో సత్కరించి అభినందనలు తెలిపారు.

Related Posts