YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి జూలై 3  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆన్ లైన్ ద్వారా ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మాట్లాడుతూ నా పాదయాత్రలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నా వద్దకు వచ్చి వారి బాధలను పంచుకున్నారు. ఇస్తామన్న జీతాలు ఇవ్వకుండా కోతలు విధించారని విలపించారు. ఉద్యోగాలు రావడానికి, జీతాలు ఇవ్వడానికీ లంచాలు తీసుకున్న గత ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిలువునా దోచుకుంది. ఈ పరిస్థితిని రూపుమాపడానికే ఏపీ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ ను తీసుకువవచ్చామని అన్నారు. గతంలో కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారని, కానీ ఆ వ్యవస్థను మార్చి నియామకాల్లో పారదర్శకత తీసుకురావాలనే చర్యలు చేపట్టామని తెలిపారు.  ఎవరికీ లంచాలు ఇవ్వనవసరంలేదని, 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మహిళలకే ఇస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తున్నాం. ఈ సంఖ్యను వచ్చే రోజుల్లో పెంచుతామని అన్నారు. జిల్లాల వారీగా కలెక్టర్లు చైర్మన్ లు గా ఉండి ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలను పర్యవేక్షిస్తారని, ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులుగా నియమితులైన వారికి ప్రతి నెల 1వ తేదీన ‘అప్కోస్’ (ఏపీసీఓఎస్) ద్వారా జీతాలు చెల్లించడం జరుగుతుందని సీఎం జగన్ వివరించారు. . ఇకపై సిఫారసులు, దళారీలకు చోటు లేదు. ఉద్యోగులకు పూర్తి భద్రతను ఇస్తాం. ఈ విధానంలో లంచాలు, కమీషన్ కు తావులేనందున ఉద్యోగికి పూర్తి జీతం చేతికి అందుతుందని స్పష్టం చేశారు.

Related Posts