మహబూబ్ నగర్: ఆసుపత్రిలో మనుషులకు కాదు... చెట్లకు సైతం ఇప్పుడు సెలైన్ ద్వార చికిత్సలు అందిస్తున్నారు. ఎనిమిది వందల సంవత్సరాలచరిత్ర గల మహబూబ్ నగర్ జిల్లా కేందంలోని పిల్లల మర్రి చెట్టు ఆనవాళ్లు కనిపించకుండా పోతున్న దశలో అధికారులు చెట్టును కాపాడుకునేందుకు ప్రయత్నలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అంటే అందరికి గుర్తుకొచ్చేది... పిల్లలమర్రి చెట్టు. ఈ చెట్టు మొదలు ఎక్కడి నుంచి ప్రారంభమైందని ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధనాలు చేసి విఫలం చెందారు. అలాంటి మర్రిచెట్టు మూడు ఏకరాలలో వ్యాపించి వుంది. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల చెట్టుకు చెదలు వచ్చి ఓ వృక్షం నేలమట్టమైంది. ఈ విశయం తెలుసుకున్న జిల్లా కలేక్టర్ రోనాల్డ్ రొస్ పిల్లలమర్రి చెట్టును పర్యవేక్షించి,చెట్టును కాపాడుకునే బాధ్యతను అటవిశాఖకు అప్పగించారు. అప్పటి నుంచి పిల్లలమర్రి చెట్టుకు చికిత్సలు ప్రారంబించారు. క్లోరోఫైరిఫస్ అనే పురుగుల మందు ద్రావణాన్ని సెలైన్లలో నింపి చెట్టుకు అందేలా ఏర్పాటు చేశారు. పట్టిన చీడపురుగును వదిలేలా చికిత్సలు మొదలు పెట్టారు.