YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దేశానికే ఆదర్శంగా రైతు వేదికల నిర్మాణం కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్ళు పారుతున్నాయి

 దేశానికే ఆదర్శంగా రైతు వేదికల నిర్మాణం కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్ళు పారుతున్నాయి

దేశానికే ఆదర్శంగా రైతు వేదికల నిర్మాణం కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్ళు పారుతున్నాయి ప్రతిపక్ష నాయకుల కళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయి -చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మల్యాల,నూకపల్లి, మరియు మానాల క్లస్టరులలో,  రైతు వేదికల నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి శంకుస్థాపన  చేశారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ  సుంకె రవి శంకర్  మాట్లాడుతూ ఐదు వేల ఎకరాల క్లస్టర్ ఆధారంగా 20 లక్షల రూపాయలతో రైతు వేదికల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. సుమారు 300మందితో సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని తెలియ చేసారు. రైతు వేదికలో ఒక హాల్,ఒక కంప్యూటర్ గది, అధికారులు కూర్చోడానికి ఒక గది ఉంటుదని అన్నారు. రైతుల సౌలభ్యం కోసం కల్లాల ఏర్పాటు చేసామని అన్నారు. రాష్ట్రంలో 750 కోట్లతో రైతు కల్లాలు.మండలానికి 1000 కల్లాల ఏర్పాటు.దరఖాస్తులను బట్టి కల్లాలను పెంచాలని తెలియ చేసారు.  రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్  లక్ష్యం అని అన్నారు.రైతుల కోసం కరోనా,లాక్ డౌన్ ఉన్నప్పటికీ 30వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలియ చేసారు. 1300కోట్లతో 25000 లోపు రైతు రుణమాఫీ చేశారని అన్నారు. 7000కోట్లతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరానికి 5000 చొప్పున జమ చేయడం జరిగిందని తెలియ చేసారు. మిగిలిన రాని రైతులు ఎవరైనా ఉంటే వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకురావాలని అన్నారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే నని తెలియ చేసారు. రైతులకు డిజిటల్ భూమి పాసుపుస్తకాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాకముందు చొప్పదండి నియోజకవర్గం ఎడారిని తలపించేది.తాగుదాంటే నీళ్ళకు కరువుండేదని అన్నారు. ఉపాధి లేక వలసలు పోయి బ్రతికేవారు ఇక్కడి రైతులని కానీ కేసిఆర్ ముఖ్యమంత్రి ఐన తరువాత కాళేశ్వరం నీళ్ళతో చొప్పదండి నియోజకవర్గంలో కరువు పారిపోయిందని ఆనందం వ్యక్తం చేసారు. చొప్పదండి నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గాయత్రి (లక్ష్మీపూర్) పంపుహౌస్ నిర్మించడం,లక్ష్మీపూర్ పంపుహౌస్ ద్వారా నారాయణ పూర్ జలాశయానికి ఒకవైపు,మద్యమానేరు జలాశయానికి ఒకవైపు రెండు వైపులా నీళ్ళను పంపిస్తున్నారని తెలియ చేసారు.
మధ్యమానేరు జలాశయం నుండి రాష్ట్ర నాలుగు దిక్కులా నీళ్ళు వెళ్ళడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే నేను పుట్టిన ఊరు నారాయణపూర్ జలాశయం నుండి మైసమ్మ చెరువు,పోతారం జలాశయాలు నింపడం ద్వారా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గతంలో కంటే సుమారు 40వేల ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణం పెరిగిందని బంగారు తెలంగాణలో ముందడుగు అనడానికి ఇది ఒక నిదర్శనమని తెలియ చేసారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కలలుకన్న బంగారు తెలంగాణ సాకారం అయ్యిందని మధ్యమానేరు జలాశయ సందర్శనలో తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇవ్వడం, ప్రజలు ఆశీర్వదించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించడం,నీళ్ళతో పులికించి పోతున్న చొప్పదండి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాని సుంకె రవి శంకర్ తెలియ చేసారు. ముఖ్యమంత్రి కెసిఆర్   దిశానిర్దేశాన్ని పాటిస్తు చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చే ప్రయత్నంలో నా వంతు పోషిస్తానని తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్   సూచించిన విధంగా చొప్పదండి నియోజకవర్గానికి 14 చెక్ డ్యాంలు మంజూరు అయ్యాయి.ఒక్క రామడుగు మండలంలో 6 చెక్ డ్యాంలు మంజూరు అయ్యాయని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే,   ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.గతంలో రైతులు నీళ్ళు లేక తమకు సరిపడినంత పంటను పండించేవారు.కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్  అపర భగీరథ ప్రయత్నం వల్ల భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయని పేర్కోన్నారు. నిండు ఎండాకాలం సైతం చెరువులు మత్తడి దుంకడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అపర భగీరథ ప్రయత్నానికి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రతిఫలానికి నిదర్శనం.ఈ చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయని దానిద్వారా బావుల్లో చెరువుల్లో ఎప్పుడూ నీళ్లు ఉంటాయని అన్నారు. కేవలం మూడు సంవత్సరాల్లో సుమారు 80వేల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సుమారుగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్  భగీరథ ప్రయత్నమేనని తెలియ చేసారు.
కెసిఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతుల ఆత్మహత్యలు ఉండేటివి.బోర్లు వేసి బోర్ల పడ్డ సందర్భాలు అనేకమని అన్నారు. ఎరువులు,విత్తనాల కోసం లైన్లో నిలబడి అటువంటి పరిస్థితి ఉండేది. నాణ్యమైన విద్యుత్తు ఉండేది కాదని .రాత్రిపూట 4గంటలు పొద్దున పూట మూడు గంటలు కరెంటు ఇవ్వడం వల్ల రాత్రిపూట పొలాల వద్దకు వెళ్లి పాముకాటుకు గురై చనిపోయిన రైతులు ఎందరో ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్  ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.
రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే నని తెలియ చేసారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు సహాయం అందించడం లేదని రైతు బీమా పథకం ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే భీమా చెల్లించి రైతు ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్యాల మండల జడ్పీటీసి రామ్మోహన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ జనగం శ్రీనివాస్, టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, నేళ్ళ రాజేశ్వర్ రెడ్డి, పలువురు సర్పంచ్ లు, ఎంపిటీసీలు టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts