YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

భూమి అక్రమించారని సెల్ టవర్ ఎక్కిన రైతులు

భూమి అక్రమించారని సెల్ టవర్ ఎక్కిన రైతులు

యాదాద్రి భువనగిరి జూలై 3 మోత్కూర్ మండలం ముశి పట్ల గ్రామంలో తమ భూమి ఆక్రమించిన వారి పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు రైతులు  మోత్కూర్ లోని సెల్ టవర్ ఎక్కారు. బాధిత  రైతులు తెలిపిన వివరాల ప్రకారం...ముశి పట్ల గ్రామానికి చెందిన కోమటిరెడ్డి యాదిరెడ్డి, సురుకంటి కృష్ణారెడ్డి, కోమటిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లకు బిజిలాపురం గ్రామ శివారులో సర్వే నంబర్ 366లో 4 ఎకరాల భూమి ఉంది. అదే సర్వే నంబర్లో మోత్కూర్ కు చెందిన మార్కెట్ మాజీ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి కి 4.15 ఎకరాల భూమి ఉండగా 2.15 ఎకరాల భూమి కి మాత్రమే పట్టా ఉందన్నారు. కాగా గతంలోనే కల్వకుంట్ల అరుణ కు 4.08 ఎకరాల భూమిని మేఘారెడ్డి అమ్ముకున్నారని, పైగా మా భూమిని కూడా ఆక్రమించుకుని తనకు ఆ సర్వే లో 9.15 ఎకరాలు ఉన్నట్టు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మా భూమిని ఆక్రమిస్తున్నాడని ఆరోపించారు. రెవెన్యూ అధికారులను, పోలీసులను అడ్డం పెట్టుకుని మాపై బెదిరింపులకు దిగుతున్నారని, మాపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేసే వరకు సెల్ టవర్ దిగేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. ఎస్ ఐ హరిప్రసాద్ సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితి ని సమీక్షించారు

Related Posts