YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్..

ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్..

ముంబై, జూలై 03, ప్రపంచాన్నంతటినీ భయపెడుతున్న కరోనాకి మందు త్వరలోనే రానుంది.. ఆగస్టు 15న ఈ మందు అందుబాటులకి వస్తుందన్న వార్తల్లో నిజమెంతో తెలుసుకోండి..కరోనావైరస్ వ్యాక్సీన్‌ని వచ్చే నెల 15న అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, భారత్ బయోటెక్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ఆగస్ట్ పదిహేను నాటికి క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసి అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ ఈ విషయంలో చాలా వేగంగా పనిచేస్తోందనీ, అయితే ఫలితం మాత్రం ఈ క్లినిక ట్రయల్స్ లో పాల్గొన్న అన్ని సంస్థల సహకారం మీద ఆధారపడి ఉందని ఐసీఎమార్ డైరెక్టర్ ఒక లెటర్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.అయితే, లెటర్ మాట నిజమేననీ, అయితే, ఆ లెటర్ కేవలం అంతర్గత సమాచారానికి మాత్రమే ఉద్దేశించబడిందనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ లెటర్ గురించి భారత్ బయోటెక్ స్పందించలేదు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కొవిడ్-19కి వ్యాక్సిన్ రావడానికి కనీసం పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల సమయం పడుతుందని అంచనా వేస్తోంది. మామూలుగా అయితే కొత్త వైరస్‌లకి వ్యాక్సిన్ తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు, లేదా కొన్ని దశాబ్దాలూ కూడా పట్టొచ్చు.కొవిడ్-19 కు దేశీయంగా వ్యాక్సిన్ తయారు చేసే ప్రక్రియలో భాగంగా చేసే క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎమ్మార్ పన్నెండు సంస్థలని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఐసీఎమార్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఒఫ్ వైరాలజీ, పూణే కలిసి ఈ వైరస్ లోని ఒక స్ట్రైన్‌ని ఐసొలేట్ చేశారు. దాని ఆధారంగా ఐసీఎమ్మార్, భారత్ బయోటెక్ కలిసి ఈ వ్యాక్సిన్ ని అభివృద్ధి చేస్తున్నట్టుగా సమాచారం.
భువనేశ్వర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎస్యూఎం హాస్పిటల్ ని హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎమ్మార్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనుక్కోడమన్నది టాప్ ప్రయారిటీ లో ప్రాజెక్ట్స్ లో ఒకటి కాబట్టి క్లినికల్ ట్రయల్స్ ఫాస్ట్ ట్రాక్ చేయాలని ఐసీఎమార్ ఈ పన్నెండు సంస్థలని కోరినట్లు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ ని తొందరగా తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితి దృష్ట్యా ఈ క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించిన అన్ని అనుమతులనీ ఫాస్ట్ ట్రాక్ చెయ్యాలనీ, జులై మొదటి వారం లో ఈ ప్రక్రియ మొదలు పెట్టాలనీ ఈ సంస్థలకి సలహా ఇవ్వబడింది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భువనేశ్వర్, ఎస్యూఎం హాస్పిటల్ తో పాటూ క్లినికల్ ట్రయల్స్ కోసం ఎంపిక చేసిన ఇతర సంస్థలు విశాఖపట్నం, రోహ్తక్, న్యూ ఢిల్లీ, బెల్గాం, నాగ్పూర్, గోరఖ్పూర్, కట్టంకులాతూర్, హైదరాబాద్, ఆర్యనగర్, కాంపూర్, గోవా లో ఉన్నాయి

Related Posts