YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఉన్నావో ఘటనపై బీజేపీ చర్యలు

 ఉన్నావో ఘటనపై బీజేపీ చర్యలు

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ ఘటనపై యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్, అతని సోదరుడు 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, న్యాయం కోసం పోరాడుతున్న ఆమె తండ్రి పోలీస్ కస్టడీలో మృతి చెందడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీంతో యోగీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ ఘటనపై బుధవారం రాత్రి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉన్నవ్ లోని మకీ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కులదీప్‌ సెంగార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అత్యాచారంతో పాటు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం అత్యాచార ఘటనతో పాటు బాధితురాలి తండ్రి హత్య కేసును కూడా సీబీఐకు అప్పగించింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే కులదీప్ స్పందిస్తూ.. ఇదంతా తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని, సీబీఐ విచారణ తర్వాత తప్పకుండా తాను నిర్దోషినని తేలుతుందని తెలిపారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానన్నారు. ఏప్రిల్ 8న ఓ యువతి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ నివాసం ముందు ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కులదీప్, అతడి అనుచరులు తనపై అత్యాచారం జరిపారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేసింది. ఆ తర్వాతి రోజే ఆమె తండ్రి పోలీస్ కస్టడీలో అనుమానస్పదంగా మృతి చెందాడు. బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్ తన అనుచరులతో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నాకు న్యాయం చేయాలంటూ ఏడాదిగా ప్రతి ఒక్కర్నీ కలుస్తున్నాను. కానీ, ఎవరూ నా గోడు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రితో మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. మేం కేసు పెడితే మమ్మల్ని బెదిరించారు. నాపై అత్యాచారం చేసిన వారందరినీ అరెస్టు చేయాలి. లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటా’ అని సదరు మహిళ చెప్పింది.

Related Posts