YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నెక్స్ట్ ఏంటీ రఘరామరాజు ప్లాన్ పై చర్చోపచర్చలు

నెక్స్ట్ ఏంటీ రఘరామరాజు ప్లాన్ పై చర్చోపచర్చలు

ఏలూరు, జూలై 4, 
ఎంపీ రామకృష్ణంరాజుతో పాటు వైసీపీ కూడా తెగించినట్లే కనపడుతుంది. త్వరలోనే దీనికి ఎండ్ కార్డు వేయాలని వైసీపీ భావిస్తుంది. రఘురామ కృష‌్ణంరాజు ఎపిసోడ్ కు త్వరగా ముగించకపోతే పార్టీ మరింత ఇబ్బందులు ఎదుర్కొంటుందని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. మరో వైపు రఘురామకృష్ణంరాజు రోజురోజుకూ రెచ్చి పోతుండటం కూడా వైసీపీ అధినేతను హర్ట్ చేసిందంటున్నారు.అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి ఎంపీ రఘురామ కృష‌్ణంరాజుపై అనర్హత పిటీషన్ ను స్పీకర్ కు అందజేస్తారు. రఘురామ కృష్ణంరాజు పార్టీ నిబంధనలు థిక్కరించారని స్పష్టమైన ఆధారాలున్నాయంటున్నారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఎంపీలు కోరనున్నారు. వీలయినంత త్వరగా రఘురామ కృష్ణంరాజుపై వేటు పడేలా చూడాలన్నది వైసీపీ నేతల ఆలోచనగా ఉంది.నిజానికి బీజీపీకి రఘురామ కృష్ణంరాజు అవసరం కంటే, వైసీపీ అవసరమే ఎక్కువగా ఉండటం కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. రాజ్యసభలో భవిష్యత్ లో మద్దతు కావాలంటే వైసీపీకి బీజేపీ అనుకూలంగానే ఉండాల్సి ఉంది. రఘురామకృష్ణంరాజు కు మాత్రం ఇప్పుడు బీజేపీ అవసరం ఉంది. బీజేపీ ఎంత మేరకు ఆయనను చేరదీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి బీజేపీ పార్లమెంటు లో బలంగా ఉండటంతో ఆయన అవసరం లేదన్నది బీజేపీ పెద్దల అభిప్రాయంగా ఉంది.దీంతో ఇటు జగన్, అటు రఘురామ కృష్ణంరాజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రఘురామ కృష‌్ణంరాజు మాత్రం ఉప ఎన్నికను కోరుకోవడం లేదు. జగన్ మాత్రం బై ఎలక్షన్ కు సిద్ధమయ్యారనే చెప్పాలి. రఘురామ కృష‌్ణంరాజు వద్ద ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆయన న్యాయపోరాటం చేయడం తప్పించి పెద్దగా ఢిల్లీలో లాబీయింగ్ చేేసే పరిస్థితి లేదు. ఇప్పటికే తన అనర్హత విషయంలో న్యాయ నిపుణులను రఘు రామకృష్ణంరాజు సంప్రదించినట్లు తెలిసింది. మొత్తం మీద రాజుగారి ఎపిసోడ్ ను త్వరగా ముగించేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Related Posts