జగిత్యాల, జూలై 04
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివిధ వైద్య పరీక్షల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ డయగ్నోస్టిక్ కేంద్రం పనులను త్వరిగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ రవి గుగులోత్ అన్నారు. శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయోగ్నిస్టిక్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బముగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో తెలంగాణ డయగ్నోస్టిక్ కేంద్రాన్ని 2500 చదరపు అడుగుల విస్థీర్ణంలొ 2ల్యాబ్ లు, ఒక పేషెంట్ వెయింటింగ్ హల్ తో పాటు, దాదాపు 70 లక్షల విలువైన పరికరాలను కూడా సమకూర్చుకోవడం జరుగుతుందని పేరోన్నారు. ఈ కేంద్రం ద్వారా రక్తపరీక్షలు, అనలైజర్ మరియు యుమినలైజ్ సేవలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కోన్నారు. ఈ వచ్చే రోగులు ఇబ్బంది పడకుండా కేంద్రం వద్ద షెడ్డుతో పాటు, కూర్చీలను కూడా ఏర్పాటు చేయాలని అదేశించారు. అనంతరం కేంద్రం వెలుపల నిలిపిన ఆర్టీసి అద్దే బస్సులను వెంటనే తొలగించాలని ఆర్టీసి సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సుపరింటెండ్ సుదక్షిణా దేవి, డా. రామకృష్ణ, పాథలజిస్ట్ సుమేలా తదితరులు పాల్గోన్నారు.