హైద్రాబాద్, జూలై 4,
కరోనా లాక్ డౌన్ తో మార్చ్ 20 నుండి సినిమా షూటింగ్స్ కి బ్రేకులు పడ్డాయి. తిరిగి ఎప్పుడు అవుతాయో తెలియదు కానీ… మళ్ళీ సినిమా షూటింగ్స్ ప్రారంభించడానికి ఇండస్ట్రీలో పెద్ద తలకాయలైన చిరంజీవి, త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల శివ,నాగార్జున లాంటి వాళ్ళు సమావేశాలు జరిపి.. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మరీ షూటింగ్స్ కి అనుమతులు తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం నియమ నిబంధనలతో షూటింగ్స్ జరుపుకోవచ్చని, ముందు ట్రయిల్ షూట్ కి అనుమతులనిచ్చింది. అయితే ఈ తతంగం అంత చూసిన బాలకృష్ణ నన్ను ఎవరు కరోనా మీటింగ్స్ కి పలవలేదని రచ్చ లేపాడు. దానితో బాలయ్యకి ఫెవర్ గా కొంతమంది, వ్యతిరేఖంగా కొంతమంది ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలకు తెరలేపారు.అయితే పెద్దలంతా కలగజేసుకుని షూటింగ్స్ కోసం అనుమతులు తీసుకొచ్చిన్నత మాత్రాన సినిమా షూటింగ్స్ జరగడం కాలే. ప్రస్తుతం కరోనా వలన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇబ్బందుల్లో పడింది. మళ్ళీ సినిమా ఇండస్ట్రీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇకనుండి మనం అనుకున్నట్టుగా షూటింగ్స్ కానీ, బడ్జెట్స్ కానీ ఉండవు అంటూ బాలయ్య మాట్లాడిన మాటలు ఇప్పుడు నిజమయ్యేలా ఉన్నాయి. చిరు వాళ్ళు షూటింగ్స్ కి అనుమతులు తెచ్చి.. కామ్ గా ఉన్నారు. మరి హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో కరోనా మళ్ళీ హైదరాబాద్ లాక్ డౌన్ అంటున్నారు. మరి ఇప్పటికి హీరోలెవరు సెట్స్ మీదకి రావడానికి సిద్ధంగా లేరు. ఎవరికీ వారే కరోనా తగ్గితే షూటింగ్స్ మొదలెట్టాలి అన్నట్టుగా ఉన్నారు. కరోనా ముందు ఎవరైనా ఒక్కటే అన్నట్టుగా ఉంది కరోనా వ్యవహారం.