YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా ఫస్ట్

ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా ఫస్ట్

ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ సెకండియర్ ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 84శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్, 77శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా రెండో స్థానంలో ఉండగా, 76 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు మూడో స్థానంలో ఉందన్నారు. ఈ ఫలితాల్లో 59శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో కడప ఉందన్నారు.ఈ యేడాది, రికార్డు స్థాయిలో పరీక్షలు జరిగిన 24 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తున్నామని అన్నారు. 4,84,889 మంది విద్యార్థులు రాశారని, ఇందులో రెగ్యులర్ ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారని మంత్రి అన్నారు.ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ కూనం తేజవర్దన్ రెడ్డి (992) రాగా, బైపీసీలో ముక్కు దీక్షిత (990) స్టేట్ ఫస్ట్ వచ్చారని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంపీసీలో స్టేట్ సెకండ్ ఆఫ్రాన్ షేక్ (991), మూడో స్థానంలో వాయలపల్లి సుష్మా (990)లు, బైపీసీలో స్టేట్ సెకండ్ నారపనేని లక్ష్మి కీర్తి (990)లు వచ్చారని మంత్రి తెలిపారు.

Related Posts