గత కొంతకాలంగా ప్రపంచం మొత్తం తెలుసుకున్న విషయం ఏమిటంటే మనలోనే ఒక డాక్టర్ ఉంటాడు అతడు మనకు కలిగే ఏ జబ్బు కైనా ఉచితంగా వైద్యం చేయగలరు అని, దాని పేరే వ్యాధినిరోధకశక్తి అని. కానీ నీ వ్యాధినిరోధకశక్తి మందుల ద్వారా రాదు, తిండి వల్ల పెరగదు, ఇది అద్భుతంగా పని చేయాలి అంటే మన మనసు అద్భుతంగా ఉండాలి, అద్భుతంగా ఆలోచించగలగాలి. మన ప్రాచీన భారతదేశ సంపద అయిన జ్ఞానం ప్రకారం వ్యాధినిరోధక శక్తి అనేది ప్రేమ,కరుణ, త్యాగము, క్షమా గుణము, ఆదరణ, దాన గుణం ఇలాంటి గుణాలు కలిగి ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఆనందంగా ఉండగలిగితే వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా పనిచేసి మనలను ఆరోగ్యవంతంగా ,ఆనందం గా ఉంచుతుంది అని. పై గుణాలన్నీ కూడా వినటానికి చాలా బాగుంటాయి కానీ ఆచరణలో చాలా కష్టంగా ఉంటాయి. పై గుణాలు మనకు ఆచరణలో రావాలి అంటే మన పూర్వీకులు అయినటువంటి ఋషి సాంప్రదాయం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందజేసింది. వాస్తవానికి అదే మన భారత దేశం యొక్క సంపద. దానిని మన యొక్క అజ్ఞానం చేత, మన యొక్క ప్రాచ్యాత మోజు వలన మనము చూడగలిగి, తెలుసుకోగలిగే స్థితిలో లేకుండా పోయము అవి.... యోగా, ప్రాణాయామము, ధ్యానము, అమృతాహారం...... మొదలైనవి. ఆలోచించండి మనకు ఏది ఊరికనే రాదు మన ప్రయత్నం, మన శ్రమ నే మన అసలైన ఆస్తి. దయచేసి మన గురించి మన శ్రేయస్సు కొరకు మనకున్న 24 గంటల్లో కనీసం ఒక గంట అయినా కేటాయించు కాకపోతే మన కోరికలు, ఆశయాలు,మన కుటుంబ సభ్యుల సుఖసంతోషాల కోసం మనం ఎలా కష్టపడగలం. కావున ప్రతిరోజు ఉదయం కేవలం మనకోసం ఒక గంట నీ కేటాయించి యోగ, ప్రాణాయామము, ధ్యానము చేస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ పైన చెప్పిన అత్యుత్తమ గుణములను పొంది ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ....... మీ శ్రేయోభిలాషి.
ఆనందం పరిపూర్ణం