YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కన్నా.. సైలెంట్ వెనుక...

కన్నా.. సైలెంట్ వెనుక...

గుంటూరు, జూలై 6, 
ఏపీలో వీస‌మెత్తు బ‌లం లేక‌పోయినా.. నిత్యం అధికార ప‌క్షాన్ని ముప్పుతిప్పలు పెట్టేలా విమ‌ర్శలు సంధించిన పార్టీ బీజేపీ. మ‌రీ ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. జ‌గ‌న్ ప్రభుత్వంపై అనేక రూపాల్లో దాడి చేశారు. రాజ‌ధాని వికేం ద్రీక‌ర‌ణ పై ఆయ‌న చేసిన పోరు.. అంతా ఇంతా కాదు. నిజానికి రాష్ట్రంలో అస‌లు ప్రతిప‌క్షం బీజేపీనా టీడీపీనా? అనే సందేహం వ‌చ్చే రేంజ్‌లో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ రెచ్చిపోయారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఒక‌రిద్దరితో సంబంధాన్ని కొన‌సాగిస్తూ.. రాష్ట్రం పూర్తిగా పార్టీపై ఆధిప‌త్యం ప్రద‌ర్శించారు. ఈ క్రమంలో కొంద‌రు త‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే.. క‌లిసి రాక‌పోయినా.. ఆయ‌న త‌న ప‌నితాను చేసుకుని పోయారు.ప్రభుత్వంలోని లోపాల‌ను ఎత్తి చూపారు. ఇసుక‌పై కూడా ఆయ‌న త‌న ఇంట్లో నిర‌స‌న వ్యక్తం చేశారు. అదే స‌మ‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప‌నుల‌ను, మ‌రీముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో కేంద్రం ప్రజ‌ల‌కు చేస్తున్న మేళ్లను క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ వ్యూహాత్మకంగా ప్రజ‌ల‌కు వివ‌రించారు. రాష్ట్రంలో పేద‌ల‌కు ఏప్రిల్ 10న జ‌గ‌న్ ప్రభుత్వం రూ.1000 అందించింది. అయితే, ఇది జ‌గ‌న్ ప్రభుత్వం ఇవ్వలేద‌ని, కేంద్రమే ఇచ్చింద‌ని ప్రచారం చేయ‌డంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ పూర్తిగా స‌క్సెస్ అయ్యార‌నే అంటారు పార్టీలోని సీనియ‌ర్లు. ఇక‌, మాస్కుల విష‌యంలోనూ.. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయ‌డంలోనూ ఆయ‌న కేంద్రం చేస్తున్న కార్యక్రమాల‌ను ప్రజ‌ల్లోకి బాగానే తీసుకువెళ్లారు.పార్టీ ప‌రంగానూ చ‌ర్చలు, కార్యక్రమాల‌నునిర్వహించేవారు. ఇక‌, ఇటీవ‌ల రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వివాదం తెర‌మీదికి వ‌చ్చిన ‌ప్పుడు.. కూడా క‌న్నా త‌న‌దైన శైలిలో జ‌గ‌న్ ను ఆయ‌న ప్రభుత్వాన్ని త‌ప్పుబ‌ట్టారు. తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఏపీ బీజేపీ రెండు వ‌ర్గాలుగా విడిపోయిన‌ట్టుగా కూడా క‌నిపిస్తోంది. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌తో పాటు పాత బీజేపీ నేత‌లు, టీడీపీ సానుభూతిప‌రులు చంద్రబాబుకు మేలు జ‌రిగేలా జ‌గ‌న్‌ను టార్గెట్‌గా చేసుకుంటూ వ‌చ్చారు. ఎంపీ జీవీఎల్‌తో పాటు రామ్ మాధ‌వ్ లాంటి వాళ్లు జ‌గ‌న్‌కు మేలు జ‌రిగేలా బాబును టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో కాని.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఇక్కడ ఎంత హ‌డావిడి చేసినా ఆయ‌న్ను మాత్రం అధిష్టానం ప‌ట్టించుకోవ‌డం లేదు.ఏపీ బీజేపీలో సుజనా, సీఎం ర‌మేష్‌, జీవీఎల్ లాంటి వాళ్ల హ‌డావిడే ఎక్కువుగా ఉంటోంది. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఏదో ఒక ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఉన్నారు. అయితే అధిష్టానం మ‌నం ఎంత చేసినా ఏపీలో బీజేపీ బ‌ల‌ప‌డే ఛాన్స్ లేద‌న్న నిర్ణయానికి వ‌చ్చేసిన‌ట్లుంది. అందుకే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే, అనూహ్యంగా కొన్నాళ్లుగా క‌న్నా మౌనం పాటిస్తున్నారు. నిజానికి కుటుంబంలో కోడ‌లు మృతి చెందిన త‌ర్వాత ఆయ‌న మౌనంగా ఉ న్నార‌ని అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. కానీ, ఇది నిజం కాదు. ఆ త‌ర్వాత కూడా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌గుంటూరు జిల్లాలో ఇసుక లావాదేవీ ల‌ను క్షేత్రస్థాయిలో వెళ్లి ప‌రిశీలించారు. అయితే, ఇక ఆ త‌ర్వాత నుంచి మాత్రం క‌న్నా సైలెంట్ అయిపోవ‌డం గ‌మ‌నా ర్హం. దీనికి కార‌ణం ఏంట‌ని ఆరాతీస్తే.. త్వర‌లోనే రాష్ట్రానికి కొత్త బీజేపీ చీఫ్‌ను ఎన్నిక చేయాల‌ని అధిష్టానం ప‌రిశీలిస్తుండ‌డ‌మే న‌ని తెలిసింది.వాస్తవానికి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ ప‌ద‌వీ కాలం అయిపోయి నెల రోజులు పైనే అయింది. దీంతో త‌న‌ను మ‌రోసారి కొన‌సాగించా ల‌న్న త‌న అభ్యర్థన‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నార‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు కొత్త చీఫ్ కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున చ‌ర్చలు, లాబీయింగులు జ‌రుగుతున్నాయ‌ని బీజేపీ అంత‌ర్గత చ‌ర్చల్లో వెల్లడ‌వుతోంది. దీంతో క‌న్నా ఒకింత హ‌ర్ట్ అయ్యార‌ని, అందుకే ఆయ‌న మౌనంగా ఉంటున్నార‌ని ఒక వాద‌న న‌డుస్తోంది. అయితే, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ అనుచ‌రులు మాత్రం కుటుంబ కార్యక్రమాలకు సంబంధించి బిజీగా ఉన్నందునే ఆయ‌న ఇంటికి ప‌రిమిత‌మ‌య్యార‌ని , మ‌రో వారంలోనే ఆయ‌న యాక్టివ్ అవుతార‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related Posts