ఛండీఘడ్, జూలై 6,
కరోనా విషయంలో గట్టిగా నిలబడి తట్టుకున్న రాష్ట్రం పంజాబ్ మాత్రమే. ఇక్కడ తొలి నుంచి లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు పర్చారు. ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన పెంచడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి. భౌతిక దూరం పాటించడంలోనూ, మాస్క్ లను ధరించడంలోనూ పంజాబ్ ప్రజలు ముందున్నారని చెప్పాల్సి ఉంది. మార్చి 23వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన లాక్ డౌన్ నిబంధనలు పంజాబ్ లోనూ అమలులోకి వచ్చాయి.కరోనా వైరస్ ఇప్పటికే భారత్ ను కుదిపేస్తుంది. ఆరు లక్షలకు చేరువలో కరోనా పాజటివ్ కేసులు దేశ వ్యాప్తంగా ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కరోనాను కట్టడి చేయలేకపోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో అత్యథిక కేసులు నమోదవుతున్నాయి. అయితే పంజాబ్ లో మాత్రం తొలి నుంచి కరనాను కొంత ప్రభుత్వం కంట్రోల్ చేస్తుందనే చెప్పాలి.పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిత్యం కోవిడ్ పై సమీక్షలు జరపడమే కాకుండా మతపెద్దలతో కరోనా వల్ల ప్రమాదం గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. లాక్ డౌన్ నిబంధనలను మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలన్న ఆదేశాలు ఇచ్చారు. ఉన్నతాధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పంజాబ్ లో లాక్ డౌన్ పటిష్టంగా అమలయిందనే చెప్పాలి.అందుకే లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న పంజాబ్ లో మాత్రం పరిమిత సంఖ్యలోనే ఉన్నాయని చెప్పక తప్పదు. పంజాబ్ లో ఇప్పటి వరకూ 5,500 కేసులు నమోదయ్యాయి. 140 మంది వరకూ మృత్యువాత పడ్డారు. రోజువారీ కేసులు తక్కువగానే ఉంటున్నాయి. దీంతో పంజాబ్ లో లాక్ డౌన్ విధించడం లేదు. నిబంధనలు మాత్రం ఖచ్చితంగా అమలుచేస్తామని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెబుతున్నారు. మొత్తం మీద పంజాబ్ రాష్ట్రం కరోనా మీద గట్టిగానే నిలబడిందని చెప్పాలి