YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మావోయిస్టు సహకారంతో డ్రగ్స్...

మావోయిస్టు సహకారంతో డ్రగ్స్...

విశాఖపట్టణం, జూలై 6, 
విశాఖపట్నం పోలీసులు డగ్స్ రాకెట్‌ను ఛేదించారు. నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.విశాఖపట్నం పోలీసులు డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేశారు. ఓల్డ్ పోర్టు క్వార్టర్స్లోని ఓ పాత భవనంలో మాదక ద్రవ్యాలు ఉన్నాయనే సమాచారంతో నాలుగో పట్టణ పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. భవనంలోని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి 61 ఎల్ఎస్డీ బ్లాట్లు, 60 గ్రాముల గంజాయి, 2.5 గ్రాముల ఎండీఎంఏ, రూ. 9,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సత్యనారాయణ, అజయ్, రవి, స్వరూప్పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో డ్రగ్స్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో రేవ్ పార్టీలో సరఫరా చేసిన వాళ్లే మళ్లీ మొదలు పెట్టారని, వారి మీద నిఘా పెట్టి పట్టుకున్నామని వివరించారు. గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా పెడుతున్నామని, మావోయిస్టుల సహకారంతోనే గంజాయి సాగు చేస్తున్నారని డీజీపీ వ్యాఖ్యానించారు.అలాగే కోవిడ్ కష్ట సమయంలో విశాఖ పోలీసులు కష్టపడి పని చేశారని డీసీపీ సవాంగ్ అన్నారు. తొలి 3 నెలల్లో కేవలం 98 కేసులు మాత్రమే నమోదయ్యాయని, లాక్ డౌన్ సడలింపు తర్వాత కేసులు క్రమంగా పెరిగాయన్నారు. మొత్తం 466 మంది పోలీసులు కోవిడ్ బారిన పడ్డారని డీజీపీ అన్నారు. జూన్ 3 వరకు కేవలం 45 మంది పోలీసులు మాత్రమే కోవిడ్ బారిన పడ్డారని, గత నెల రోజుల్లో 421 మందికి కోవిడ్ సోకిందని వెల్లడించారు. కరోనా సమయంలో పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న విశాఖ ప్రజలకు డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts