YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుకన్య స్కీమ్ కు రూల్స్ మారింపు

సుకన్య స్కీమ్ కు రూల్స్  మారింపు

న్యూఢిల్లీ, జూలై 6, 
కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ రూల్స్‌ను సవరించింది. కరోనా వైరస్ నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకంలో చేరాలని యోచించే వారికి ప్రయోజనం కలుగనుంది.కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెనింగ్ ఎలిజిబిలిటీ రూల్స్‌ను సవరించింది. సాధారణంగా సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేయాలంటే 10 ఏళ్లలోపు వయసు ఉండాలి. అయితే ఇప్పుడు పదేళ్లు దాటినా కూడా ఈ పథకంలో చేరొచ్చు. దీనికి సంబంధించి రూల్‌ను సవరించింది.సుకన్య సమృద్ధి అకౌంట్‌ను ఆడ పిల్ల పేరుపై తెరవొచ్చు. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లలపై ఈ ఖాతా ఓపెన్ చేయొచ్చు. అయితే కొత్త రూల్ కేవలం జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే ఇప్పుడు ఆడ పిల్లకు పదేళ్లు దాటినా కూడా జూలై 31లోపు ఈ స్కీమ్‌లో చేరొచ్చు.లాక్ డౌన్ సమయంలో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను తెరవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఊరట కలుగనుంది. ఇకపోతే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఇతర స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో కెల్లా ఈ పథకంపైనే ఎక్కువ వడ్డీ వస్తోంది.

Related Posts