*శ్రీకాళహస్తిక్షేత్రం యొక్క. విశిష్టత*
దక్షిణ కైలాసంగా పిలవబడే శ్రీకాళహస్తి క్షేత్రానికి ఈ దేశంలోని అనేక శైవ క్షేత్రాలకు ఇక్కడ జరిగే పూజా విధులకు చాలా వ్యత్యాసాలు సాధారణంగా కనిపిస్తూఉంటాయి అందులో ఒకటి ఈ క్షేత్రములో స్వామికి నాలుగు కాలాలలో జరిగే పచ్చకర్పూర అభిషేకము.
మొదటిది ప్రాతః కాలము రెండోవది సంగవకాలము మూడోవది ఉచ్చకాలము నాల్గోవది ప్రదోషకాలము ఈవిధముగా నాల్గుకాలముల పూజ ఆగమోక్తమైనది అందులోనూ విశేషంగా ఈ కాలములలో జరిగే అభిషేక ప్రక్రియలో రుద్రాభిషేకంతో కలిపి పంచామృతాలు మొదలైన విశేష అభిషేకాలు జరుగడం సర్వసాధారణం.
శ్రీకాళహస్తిలో విశేషం ఏమిటంటే ఈ విశేషద్రవ్యాలతో కూడిన అభిషేకం అంతా శ్రీకాళహస్తీశ్వర స్వరూప వాయులింగంలోని ప్రణాళి(పానవట్టంన)కే జరుపబడుతుంది.
శ్రీ,కాళ,హస్తి లను తనలో ఐక్యం చేసుకున్న శ్రీకాళహస్తీశ్వలింగమునకు జరుగదు ఆ లింగమునకు పైన పేర్కొన్న విధంగా నాలుగు కాలముయందు ఈ మూల లింగమునకు కేవలము ఒక్కొక కాలములో ఐదు శంఖముల చప్పున పచ్చకర్పూర జలముచే మాత్రమే అభిషేకం జరుపబడుతుంది,
అలా ఒక్కొక్క కాలంలో ఐదు శంఖముల అభిషేకం చేయడానికి కారణం ఏమిటంటే శివునికి ఐదు ముఖములులైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖములు ఉద్దేశించి ఒక్కొక్క ముఖమును ఉద్దేశించి ఒక్కొక్క శంఖముతో అభిషేకం చేయడం అని నిర్వచనంగా ఆర్యుల వచనం.
ఇలా పచ్చకర్పూర అభిషేకం మాత్రము నాలుగు కాలములయందు జరగడం మరెక్కడా లేదు ఈ క్షేత్రంలో మాత్రనే జరగడం విశేషము,
ఇలా చేయడం కేవలం సాంప్రదాయంగా వచ్చినదా లేక నియమంతో కూడుకున్నాదా అని పరిశీలిస్తే,
ఈ పచ్చకర్పూర అభిషేకం చేయడం దాని ఫలితం గురించి శ్రీకాళహస్తి స్థల పురాణం ఎనిమిదో అధ్యాయం నూటపదోవ శ్లోకము నుండి రోమశ మహాముని ఈ విధంగా తెలిపారు.
శ్లో: ఇత్యువాచ తతోవేధా వరయా మాసతంవరాన్!కర్పూరోదాభిషేకేన లింగేస్మిన్ వాయురూపకే!త్రికలమేకకాలంవా ప్రతివారం శివాధవా!ప్రీతింతే దినమేకంవా యధాశక్తి కరోతియ:!తస్మై ప్రీతో భవాత్యర్థం కృతినే చంద్రశేఖర!కర్పూరో దాభిషేకస్య యఃకరోతి విలోకనం!తస్యపాప వినశ్యంతు సకలా న్యంబికాపతే!నిర్మాల్యన్చ తథాపానం కుర్వత సన్నిధౌ తవ!భూయాద్దేవ మనశుద్ది స్సాకైవల్యం భవేద్యయా!!
దీని భావం ఏమిటంటే ఈ వాయుస్వరూపమైన ఈ లింగమునకు ఎవరు భక్తితో ఎవరు మూడు కాలములయందు కానీ ఒక కాలమందుకాని ప్రతిదినముకాని ఏదైనా పర్వకాలములలో కానీ పచ్చకర్పూరముతో ధారాభిషేకం చేస్తారో ఆ పుణ్యపురుషుని యొక్క అభిషేకమును గ్రహించిన అంబికాపతి అయిన పరమేశ్వరుడు ఆ అభిషేకం చేసిన వారి పాపములన్ని పరిహరింపబడతాయి
ఈ పచ్చకర్పూర అభిషేక జలమును నీ సన్నిధి యందు ఎవరు పానము(తీర్థముగా స్వీకరిస్తారో)తాగుతారో వారి భూమియందు నివసించిన్నంత కాలము మనశుద్ది కలిగి దేహాంతరము కైవల్యము ప్రాప్తిస్తుంది అని తెలుపబడింది,
ఇంత ప్రశస్తి పురణములో తెలుపబడి ఉండుట చేతనే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి ఈ పచ్చకర్పూరముతో అభిషేకం గావించి స్వామిని దర్శించే భక్తులకు ఎక్కడా లేని విధంగా భక్తుల యొక్క పాపములను పోగొట్టుటకు ఈ పచ్చకర్పూర జలాన్ని తీర్థంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది అంత మహిమాన్వితమైనది శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అభిషేకతీర్థము,
మరొక విశేషం ఆర్షకాలంలోనే కొన్ని దేవాలయములందు ఇలా ప్రతి నిత్యము అభిషేక ప్రక్రియను మొదలు పెట్టి కొంత కాలానికి ఆ పచ్చకర్పూరలోని ఉష్ణమునకు ఆ లింగమునలు విచ్చిన్న మవడం కూడా జరిగిన సందర్భములు కలవు,కానీ కాలాన్ని నిర్ణయించలేని కాలము నుండి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు అభిషేకమును జరుపుకొంటూ భక్తులను అనుగ్రహిస్తునారు అనడంలో సందేహము లేదు.
By: VARAKALA MURALIMOHAN