YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కొత్త గైడ్ లైన్స్ తో హోం ఐసోలేషన్

కొత్త గైడ్ లైన్స్ తో హోం ఐసోలేషన్

కొత్త గైడ్ లైన్స్ తో హోం ఐసోలేషన్
హైద్రాబాద్, 
హోం ఐసోలేషన్ గైడ్లైన్స్లో  ఆరోగ్య శాఖ మార్పులు చేసింది. దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఇప్పటికే ఏదో ఒక వ్యాధి బారిన పడి బాధపడుతున్న వ్యక్తికి కరోనా వస్తే.. వారు హోమ్ ఐసోలేషన్లో ఉండేందుకు పర్మిషన్ ఇవ్వరు. కరోనా లక్షణాలు కనిపించిన 10 రోజుల తర్వాత రోగులకు వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకపోతే ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. వెరీ మైల్డ్, ప్రీ సింప్టమాటిక్, అసింప్టమాటిక్ కరోనా పేషెంట్ల హోం ఐసోలేషన్ రివైజ్డ్ గైడ్లైన్స్ను రిలీజ్ చేసింది.రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పేషెంట్లు హోం ఐసోలేషన్లో ఉండేందుకు అర్హులు కాదు.
60 ఏళ్లు పైబడిన రోగులు, రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు డాక్టర్ల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్లో ఉండేందుకు పర్మిషన్ ఇస్తారు.హోం ఐసోలేషన్ టైంను సర్కారు తగ్గించింది. కరోనా లక్షణాలు కనిపించిన 10 రోజుల తర్వాత రోగులకు వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకపోతే ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. అయితే తర్వాత కూడా ఐసోలేట్ అయి ఉండాలని అడ్వైజ్ చేస్తారు. ఏడు రోజుల వరకు పేషెంట్ తన ఆరోగ్య పరిస్థితిని సెల్ఫ్ మానిటర్ చేసుకోవాలి.హోం ఐసోలేషన్ పిరియడ్ అయిపోయిన తర్వాత టెస్టులు చేయాల్సిన అవసరం లేదు.వెరీ మైల్డ్, ప్రీ సింప్టమాటిక్ పేషెంట్లు హోం ఐసోలేషన్లో ఉండాలంటే ఉండొచ్చు. అయితే అక్కడ సెల్ఫ్ ఐసోలేషన్ ఫెసిలిటీ కచ్చితంగా ఉండాలి.24×7 ప్రాతిపదికన పేషెంట్ను చూసుకునేందుకు ఓ సంరక్షకుడు అందుబాటులో ఉండాలి. హోం ఐసోలేషన్ పిరియడ్ అయిపోయే వరకు కేర్ గివర్, ఆస్పత్రి మధ్య కమ్యూనికేషన్ లింక్ అవసరం.కేర్ గివర్, పేషెంట్ క్లోజ్ కాంటాక్ట్స్.. డాక్టర్ల సూచన మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వేసుకోవాలి.
ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అన్ని సమయాల్లో అది ఆన్లోనే ఉండాలి.పేషెంట్లు రెగ్యులర్గా తమ హెల్త్ను మానిటర్ చేసుకోవాలి. జిల్లా సర్వైలెన్స్ ఆఫీసర్కు తమ హెల్త్ స్టేటస్ను రెగ్యులర్గా ఇన్ఫామ్ చేయాలి.ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లో సీరియస్ సింప్టమ్స్ కనిపిస్తే వెంటనే మెడికల్ అటెన్షన్ ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి కేసులను రాష్ట్రాలు పర్యవేక్షించాలి.హోం ఐసోలేషన్లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని ఫీల్డ్ స్టాఫ్/నిఘా బృందాలు వ్యక్తిగతంగా వెళ్లి తెలుసుకోవాలి. ప్రత్యేక కాల్ సెంటర్‌ ద్వారా రోగుల మెడికల్ కండిషన్పై ఫాలో అప్ చేయాలి.ప్రతి పేషెంట్ క్లినికల్ స్టేటస్ను ఫీల్డ్ స్టాఫ్ లేదా, కాల్ సెంటర్ ద్వారా రికార్డు చేయాలి. (బాడీ టెంపరేచర్, పల్స్ రేట్, ఆక్సిజన్ సాచురేషన్ వంటివి నమోదు చేసుకోవాలి.ఐసోలేషన్లో ఉన్న పేషెంట్ల వివరాలను కొవిడ్ 19 పోర్టల్లో అప్డేట్ చేయలి.

Related Posts