రిపోర్టుల కోసం పడిగాపులు
హైద్రాబాద్,
కరోనా రిపోర్టుల కోసం టెస్టులు చేయించుకున్న అనుమానితులు పడిగాపులు పడాల్సి వస్తున్నది. పాజిటివా? నెగిటివా? అని చెప్పడానికి వైద్య,ఆరోగ్య శాఖ రోజుల తరబడి సమయం తీసుకుంటున్నది. ప్రతిరోజూ హెల్త్ బులిటిన్‌లో చెప్పినట్టుగా పేషెంట్లకు సకాలంలో సమాచారం అందట్లేదు. దీంతో తమకు పాజిటివ్ వచ్చిందా? నెగిటివ్ వచ్చిందా? అని తెలియక తీవ్ర మానసీక ఆందోళనతో కుంగిపోతున్నారు. పాజిటివ్ వచ్చిన వారికైనా రెండు, మూడు రోజుల తర్వాతే చెబుతున్నారు గానీ...నెగిటివ్ వచ్చినవారి గురించి అసలు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితునికి కరోనా రావడంతో అనివార్యంగా తానూ టెస్టు చేయించుకున్నాడు. నాలుగురోజులైనా ఆయనకు టెస్ట్ ఫలితం గురించి తెలియలేదు. దీంతో ఆయన తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురయ్యాడు. తనకు తెలిసిన వారి సహాయంతో వైద్యాధికారుల చుట్టూ ఒక రోజు తిరిగాడు. వాళ్లద్వారా, వీళ్ల ద్వారా ఉన్నతాధికారుల నెంబర్ రాబట్టుకుని రిక్వెస్టు చేసి సమాచారం తెప్పించగా ఆయనకు పాజిటివ్ అని తేలింది. పాజిటివా? నెగిటివా? అన్న సమాచారం రెండు రోజుల్లో ఇస్తున్నామంటూ అధికారులు చెబుతున్నప్పటికీ ఆయనకు ఎలాంటి విషయమూ చెప్పలేదు. దీంతో తనకు కరోనా రాలేదని భావించాడు. కానీ, ఎంతకైనా మంచిది అని నెగిటివ్ వచ్చిన రిపోర్టు అయినా తీసుకుందామని ప్రయత్నించగా ఆ సంగతి ఆలస్యంగా బయటపడింది. ఓ బ్యాంకుకు చెందిన ఎనిమిది ఉద్యోగులు కరోనా టెస్టు చేయించుకున్నారు. ఏడుగురి రిపోర్టులు మాత్రమే ఇచ్చారు. దీంతో ఆందోళనతో ఎనిమిదో వ్యక్తి తాను టెస్టు చేయించుకున్న ప్రదేశానికి వెళ్లాడు. తాను ఆఫీసుకు వెళ్లాలా? వెళ్లకూడదా? తెలియక ఆందోళనకు గురై రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ రిపోర్టు వస్తేగానీ తాను ఆఫీసుకు వెళ్లే అవకాశం లేదు. ఓ ఆశావర్కర్ భర్తకు పాజిటివ్ వచ్చింది. కానీ, వారికి సమాచారమే అందలేదు. ఆ ఆశావర్కర్ తనకున్న పరిచయాలతో తన భర్తకు పాజిటివ్ అని తెలుసుకుంది. దీంతో అతను ఓ ఆస్పత్రికెళ్లి చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు.హైదరాబాద్‌లోని పలు ప్రయివేటు ల్యాబ్ లలో తాత్కాలికంగా కరోనా టెస్టులను నిలిపి వేశారు. ఐదో తేదీ వరకు శాంపిళ్లు తీసుకోవడాన్ని ఆపేశారు. ఐసీఎంఆర్ తెలంగాణ వ్యాప్తంగా 18 ప్రయివేటు ల్యాబ్‌లకు కరోనా పరీక్షలు నిర్వహిం చేందుకు అనుమతిచ్చింది. దీంతో 15 రోజుల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వైద్యారోగ్యశాఖ అధికారుల బృందం ప్రయివేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షల నిర్వహణను పరిశీలిం చింది. అక్కడ జరుగుతున్న లోపాలను ఎత్తిచూ పింది. 48 గంటల్లో ఆ లోపాలను సవరించు కోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆఘమే ఘాల మీద కొన్ని ల్యాబ్‌లు తమ తప్పులను సరిదిద్దుకున్నాయి. కరోనా శాంపిళ్లను సేకరించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు డిజ్ ఇన్‌ఫెక్షన్ కోసం నాలుగు రోజుల పాటు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్టు ప్రయివేటు ల్యాబ్‌లు ప్రకటించాయి. ప్రయివేటు ఆస్పత్రి సిబ్బంది శాంపిళ్లు సేకరించి పంపిస్తే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపాయి. పరీక్షలు చేయించుకేనే అనుమానితుల శాంపిళ్లు మాత్రం సేకరించబోమని స్పష్టం చేశాయి. ఈనెల 6 నుంచి తిరిగి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలియ జేశాయి. దీనికి సంబంధించి వైద్యఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోవడం గమనార్హం.కరోనా రిపోర్టుల కోసం టెస్టులు చేయించుకున్న అనుమానితులు పడిగాపులు పడాల్సి వస్తున్నది. పాజిటివా? నెగిటివా? అని చెప్పడానికి వైద్య,ఆరోగ్య శాఖ రోజుల తరబడి సమయం తీసుకుంటున్నది. ప్రతిరోజూ హెల్త్ బులిటిన్‌లో చెప్పినట్టుగా పేషెంట్లకు సకాలంలో సమాచారం అందట్లేదు. దీంతో తమకు పాజిటివ్ వచ్చిందా? నెగిటివ్ వచ్చిందా? అని తెలియక తీవ్ర మానసీక ఆందోళనతో కుంగిపోతున్నారు. పాజిటివ్ వచ్చిన వారికైనా రెండు, మూడు రోజుల తర్వాతే చెబుతున్నారు గానీ...నెగిటివ్ వచ్చినవారి గురించి అసలు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితునికి కరోనా రావడంతో అనివార్యంగా తానూ టెస్టు చేయించుకున్నాడు. నాలుగురోజులైనా ఆయనకు టెస్ట్ ఫలితం గురించి తెలియలేదు. దీంతో ఆయన తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురయ్యాడు. తనకు తెలిసిన వారి సహాయంతో వైద్యాధికారుల చుట్టూ ఒక రోజు తిరిగాడు. వాళ్లద్వారా, వీళ్ల ద్వారా ఉన్నతాధికారుల నెంబర్ రాబట్టుకుని రిక్వెస్టు చేసి సమాచారం తెప్పించగా ఆయనకు పాజిటివ్ అని తేలింది. పాజిటివా? నెగిటివా? అన్న సమాచారం రెండు రోజుల్లో ఇస్తున్నామంటూ అధికారులు చెబుతున్నప్పటికీ ఆయనకు ఎలాంటి విషయమూ చెప్పలేదు. దీంతో తనకు కరోనా రాలేదని భావించాడు. కానీ, ఎంతకైనా మంచిది అని నెగిటివ్ వచ్చిన రిపోర్టు అయినా తీసుకుందామని ప్రయత్నించగా ఆ సంగతి ఆలస్యంగా బయటపడింది. ఓ బ్యాంకుకు చెందిన ఎనిమిది ఉద్యోగులు కరోనా టెస్టు చేయించుకున్నారు. ఏడుగురి రిపోర్టులు మాత్రమే ఇచ్చారు. దీంతో ఆందోళనతో ఎనిమిదో వ్యక్తి తాను టెస్టు చేయించుకున్న ప్రదేశానికి వెళ్లాడు. తాను ఆఫీసుకు వెళ్లాలా? వెళ్లకూడదా? తెలియక ఆందోళనకు గురై రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ రిపోర్టు వస్తేగానీ తాను ఆఫీసుకు వెళ్లే అవకాశం లేదు. ఓ ఆశావర్కర్ భర్తకు పాజిటివ్ వచ్చింది. కానీ, వారికి సమాచారమే అందలేదు. ఆ ఆశావర్కర్ తనకున్న పరిచయాలతో తన భర్తకు పాజిటివ్ అని తెలుసుకుంది. దీంతో అతను ఓ ఆస్పత్రికెళ్లి చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు.