కడప జూలై 6,
కడప జిల్లాలో రెండు రోజుల పాటు ఎపి సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల అయన పర్యటన ఖరారయింది. మంగళవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఇడుపులపాయ కు చేరుకోని అక్కడి అతిథి గృహంలో బస చేస్తారు. బుధవారం ఉదయం వైఎస్సార్ ఘాట్ కు చేరుకోని కుటుంబ సభ్యులతో కలిసి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కి నివాళలర్పిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ట్రిబుల్ ఐటీకి చేరుకుంటారు. ట్రిపుల్ ఐటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అకాడమీ కాంప్లెక్స్ భవనానికి ప్రారంభోత్సవం చేసి సోలార్ పవర్ ప్రాజెక్టు కు పునాది రాయి వేస్తారు. అనంతరం ఇడుపులపాయ అతిథి గృహానికి చేరుకోని అరగంట పాటు విశ్రాంతి తీసుకుంటారు. తరువాత కడప ఎయిర్ పోర్టుకు చేరుకోని గన్నవరం బయలుదేరుతారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికార యత్రాంగం పఠిష్టమైన చర్యలు చేపట్టింది. ఆరు నెలల తరువాత ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్నారు. కోవిడ్ వైరస్ నేపథ్యంలో సీఎం పర్యటనకు పరిమిత సంఖ్యలో నేతలు, కార్యకర్తలకు అనుమతి నిచ్చారు. జనం గుమి గూడకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. సీఎం పర్యటనకు వెళ్ళే అధికారులకు, పాత్రికేయులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. టెస్ట్ లో నెగిటివ్ వస్తేనే పర్యటనకు అనుమతి ఇస్తారు.