అమరావతి జూలై 6,
కరోనా పరీక్షల్లో రాష్ట్రం రికార్డ్ నెలకొల్పిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రోజుకి 36,047 పరీక్షలు చేసే సామర్థ్యాన్ని సాధించాం. కరోనా పరీక్షల మొత్తం సంఖ్య 10 లక్షలకు చేరింది. సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. కరోనా వ్యాప్తిని నియంత్రించే స్థాయికి తీసుకొచ్చామని అన్నారు. త్వరలోనే కరోనాను జయిస్తాం.. అందరూ ఇళ్లలోనే, సురక్షితంగా ఉండాలి' అని మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు.