నటీనటులు: నాని.. అనుపమ పరమేశ్వరన్.. రుక్సర్ మీర్.. బ్రహ్మాజీ.. రవి అవానా.. సుదర్శన్.. దేవదర్షిని తదితరులు
మ్యూజిక్: హిప్ హాప్ తమిళ
ప్రొడ్యూసర్స్: సాహు గారపాటి, హరీష్ పెద్ది
డైరెక్టర్: మేర్లపాక గాంధీ.
టాలీవుడ్ హిట్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు నాని. నటనతో పాటు స్టోరీల ఎంపీకలోనూ నానికి తిరుగులేదు. వరుసహిట్లతో దూసుకుపోతున్న నాని... యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో `కృష్ణార్జునయుద్ధం` తో ముందుకొచ్చాడు. వేసవి సీజన్‌లో వస్తుండటం... అందునా నాని డ్యూయల్ రోల్ లో వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరింతకీ కృష్ణార్జునులు ఎలా ఉన్నారు? నాని సక్సెస్ ని ఈ మూవీ కంటిన్యూ చేసిందా..?
స్టోరీ: ఎలాంటి బంధుత్వం, రక్తసంబధం లేని వ్యక్తులు కృష్ణ(నాని), అర్జున్(నాని). కృష్ణది చిత్తూరు జిల్లాలోని అకుర్తి గ్రామం. ఊళ్లో కనిపించిన ప్రతీ అమ్మాయిని లవ్ చేయాలనుకుంటాడు. అర్జున్ యూరప్‌లో ఒక పాప్ స్టార్. అతడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఫుల్ గా ఉంటుంది. కానీ అర్జున్ మాత్రం సుబ్బలక్ష్మి(అనుపమ)ని లవ్ చేస్తాడు. కృష్ణను కూడా ఆ ఊరి సర్పంచ్ మనవరాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన రియా(రుక్సార్) ప్రేమిస్తుంది. ఇంతలో ఈ రెండు ప్రేమ కథల్లో ఓ ట్విట్స్ చోటు చేసుకుంటుంది. ఇంతకీ వాళ్ల జీవితాల్లో వచ్చిన ట్విస్ట్ ఏంటి.. రెండు జంటలు ప్రేమను గెలిపించుకున్నాయా.. అనేది స్క్రీన్ పై చూడాల్సిందే.
ఎలా ఉంది: చాలా సింపుల్‌గా సాగే స్టోరీ ఇది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సరదా సన్నివేశాలతో ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అసలు స్టోరీని చూపించారరు. .. సినిమా ప్రాంరంభం అంతా రొటీన్ గా సాగుతుంది. స్టోరీ ముంకెళ్తున్న కొద్దీ.. కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. మరోపక్క రాక్‌స్టార్ అర్జున్ ప్లేబాయ్‌గా సందడి చేస్తుంటాడు. బ్రహ్మాజీ(బ్రహ్మాజీ) మ్యూజిక్ అంటే చెవి కోసుకునే సుబ్బలక్ష్మి పిన్ని(దేవదర్శిని) నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. కామెడీతో సాగుతున్న స్టోరీ అనూహ్య మలుపు తిరుగుతుంది. ఇద్దరు హీరోయిన్‌లు, హీరోలు ఒకే విధమైన సమస్యలో చిక్కుకుంటారు. తర్వాత ఏంటనే ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే ఆ ఆసక్తికి తగ్గట్లుగా సెకండ్ హాఫ్ లేదు. తాము ప్రేమించిన అమ్మాయిలను హీరోలు రక్షించడమే అసలు స్టోరీ. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో ఎంటర్టైన్ మెంట్ తగ్గింది. స్టోరీలో కూడా విషయం తగ్గిపోవడంతో సాగదీసినట్లనిపిస్తుంది.
ఎలా చేశారు: రెండు పాత్రలకు నాని న్యాయం చేశాడు. అర్జున్ కంటే కృష్ణగానే బాగా సూట్ అయ్యాడు.
పల్లెటూరి నేపథ్యంలో నాని పండించిన వినోదం సూపర్ అనిపిస్తుంది. వినోదం ఆద్యంతం నవ్వులు పంచుతుంది. హీరోయిన్లద్దిరూ అందంగా కనిపించారు. ఫస్ట్ హాఫ్ లో బ్రహ్మాజీ, నాని స్నేహితులుగా.., నటులు కనిపించిన, సుబ్బలక్ష్మి పిన్నిగా నటించిన దేవదర్శిని, ప్రభాస్ శ్రీను తదితరులు కామెడీని బాగానే పండించారు. చిత్తూరు జిల్లా పల్లెటూరి అందాలను చాలా అందంగా చూపించింది. మ్యూజిక్ బాగానే ఉంది. హీరోల పాత్ర సమానంగా నడిచింది.
ప్లస్ పాయింట్స్:
+నాని నటన
+ ఫస్ట హాప్ లో కామెడీ
+ పాటలు
మైనస్ పాయింట్స్
- స్టోరీ
- సెకండ్ హాఫ్