YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతును రాజుగా చూడాలనేదే ప్రభుత్వ లక్ష్యం రైతుల సౌలభ్యం కోసం కల్లాల ఏర్పాటు. -చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

రైతును రాజుగా చూడాలనేదే ప్రభుత్వ లక్ష్యం రైతుల సౌలభ్యం కోసం కల్లాల ఏర్పాటు. -చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

చొప్పదండి జూలై 6, 
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామంలో  రైతు కల్లాలను చొప్పదండి నియోజక వర్గ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ మాట్లాడుతూ రైతు కల్లాల గురించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో 750 కోట్లతో రైతు కల్లాలు ఏర్పాటు చేస్తున్నామని చొప్పదండి నియోజక వర్గానికి వేయి కల్లాలు మంజూరైనాయని దరఖాస్తులను బట్టి కల్లాలను పెంచుతామని తెలియ చేసారు. రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యమని అన్నారు.రైతుల కోసం కరోనా,లాక్ డౌన్ ఉన్నప్పటికీ 30వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. 1300కోట్లతో 25000 లోపు రైతు రుణమాఫీ చేశామనీ తెలియ చేసారు.7000కోట్లతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరానికి 5000 చొప్పున జమ చేయడం జరిగిందని పేర్కోన్నారు. మిగిలిన రాని రైతులు ఎవరైనా ఉంటే వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకురావాలని కోరారు.
రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే నని తెలియ చేసారు. రైతులకు డిజిటల్ భూమి పాసుపుస్తకాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మండల ప్రజా ప్రతి నిదులు, టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, రైతు సమన్వయం సంఘం నాయకులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు..

Related Posts