YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

విద్యుత్ బిల్లులు భారం

విద్యుత్ బిల్లులు భారం

కరీంనగర్ జూలై 6, 
టిపిసిసి పిలుపులో భాగంగా లాక్ డౌన్ సమయంలో వచ్చిన అధిక విద్యుత్ చార్జీలకు నిరసనగా కరీంనగర్ లోని విద్యుత్ ఎస్.ఈ కార్యాలయం ముందు కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగాలు చేసుకోకుండా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారికి విద్యుత్ బిల్లు అధిక భారంగా మారినాయి. టెలిస్కోపిక్ విధానం లేక నాన్ టెలిస్కోపిక్ విధానం వలన విద్యుత్ చార్జీలు స్లాబ్ రేట్ ప్రకారం లేక పోవడంతో మూడు నెలల విద్యుత్ బిల్లులు ఒకేసారి లెక్కించడం వల్ల హైయెస్ట్ స్లాబ్ రేటు ప్రకారం విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయి . పేద ప్రజలు ఈ అధిక విద్యుత్ చార్జీలను కట్టలేని పరిస్థితిలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలోని విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతున్నాం. మూడు నెలల ఇంటి కిరాయి ని కట్టొద్దు హితవు పలికినా మీరే మీ చేతిలో ఉన్న కరెంటు బిల్లులను ఎందుకు మాఫీ చేయడం లేదు అని ప్రశ్నించారు.
ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో వచ్చిన అధిక విద్యుత్ చార్జీలు ప్రజలకు మోయలేని భారంగా ఉన్నందున ఈ విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లోని అన్ని మండల,పట్టణల్లొని విద్యుత్ కార్యాలయాల ముందు నిరసనల ద్వారా ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కొసం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని తెలియజేశారు.
ఈ  కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధులు దాసరి భూమయ్య, ఒంటెల రత్నాకర్, సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఏ మోసిన్ మరియు జిల్లా ముఖ్య నాయకులు సమాద్ నవాబ్, వీరగోని శ్రీనివాస్ గౌడ్, బోనాల శ్రీనివాస్, పులి ఆంజనేయులు గౌడ్, అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అఖిల్, కొమ్ము సునీల్, మన్నె జీవన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts