YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రివర్స్ టెండర్ల ద్వారా 400 కోట్లు ఆదా

రివర్స్ టెండర్ల ద్వారా 400 కోట్లు ఆదా

విజయవాడ జూలై 6, 
విజయవాడ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేశాం. సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగర అభివృద్ధి కి చేయమని అదేశించారు. సింగ్ నగర్ లో 10 కోట్ల తో మోడల్ పార్క్ అభివృద్ధి కి శంఖుస్థాపన చేశాం, అదనపు నిధులు చేస్తాం, ఏడాది లోపు పూర్తి చేస్తామని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు.  ఇక్కడ ఉన్న డంప్ యార్డ్ లో అత్యాధునికం గా, ఆదర్శంగా ఈ పార్క్ ను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో పేదలకు మంచి చేసే ప్రతిపని అడ్డుకుని ప్రతిపక్షం కుట్ర చేస్తోంది. మొదట 25 లక్షలు అనుకున్నాం, 30 లక్షలు పేదలకు ఇళ్ళు స్థలాలు ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు. భూములు స్వచ్చందంగా ఇచ్చారు, భూసేకరణ ద్వారా పేదలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం అవుతుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోర్టులు నుంచి స్టే తీసుకు వచ్చి కుట్రలు చేస్తోంది.. టీడీపీ చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు.  ప్రతి పేదవాడు టిడిపి చేస్తున్న కుట్రలు గమనించాలి. గత ప్రభుత్వం లో ఒక్క ఇళ్ళు నిర్మాణం చేపట్టారా అని ప్రశ్నించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి ఇవ్వడానికి చూస్తుంటే.. టీడీపీ కుట్ర చేస్తోంది. నాడు దివంగత నేత వైఎస్ ఆర్ ప్రతి పేదవాడికి ఇళ్లను అందిస్తే.. అదే స్ఫూర్తితో నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు సిద్ధం అయ్యారు. టీడీపీ నేతలు పర్యటన పై  అయన మండిపడ్డారు. ఈరోజు ఇవ్వాల్సిన పేదలు ఇళ్ల పట్టాలు ఆలస్యం కావచ్చు ఏమో కానీ,ఇవ్వడం మాత్రం పక్కాగా అందిస్తాం. టిడ్కో 3000 చదరపుగజాల  ఇళ్లు అన్ని పేదలకు ఉచితంగా ఇస్తాము. రివర్స్ టెండర్లు ద్వారా 400 కోట్లు ఆదా చేశామని మంత్రి అన్నారు.

Related Posts