నెల్లూరు జూలై 6,
డాక్టర్ పద్మ భూషణ్ చిరంజీవి పిలుపు మేరకు అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణ స్వామి నాయుడు ఆదేశాల మేరకు చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమం అలవల, సురేష్ వారి చేతుల మీదగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు కొట్టే,వెంకటేశ్వర్లు రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు .తీగల చంద్రశేఖర్ గూడూరు జనసేన నాయకులు చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మాభాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోణ కారణంగా తలసిమియా చిన్నారుల కొరకు మరియు జిల్లాలో రక్త కొరత చాలా ఎక్కువగా ఉందని ,ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. మెగా రక్తదాన శిబిరంలో 45 మంది రక్తదాతల పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన చిరంజీవి సేవా సంఘం సభ్యులకు పట్టణ ప్రజలకు, మెగాఅభిమానులకు, పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం సభ్యులు హరిబాబు, ప్రభు, శివకూమార్,రేవంత్, సుజన్,ముత్తు,మణి, సూర్య, హేమంత్,మరియు ఉస్మాన్ భాషా మరియుఇండియన్ రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.