అమరావతి జూలై6 జూలై 6,
వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రతీ ఏడాది ఏపీ ప్రభుత్వం పురస్కారాలు అందజేస్తుంటుంది. అయితే ఈ ఏడాది కూడా పురస్కారాలు అందుతాయని ఆశావహులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కరోనా విజృంభణ కారణంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారికి పురస్కారాలు అందించడాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఏపీ సమాచార పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా తీవ్రత ఇప్పట్లో తగ్గేట్టు లేదని.. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ శాఖ వివరణ ఇచ్చింది.ప్రస్తుతం ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనాను అదుపు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. వ్యాక్సిన్ వస్తే తప్ప ఈ వ్యాధిని ఎదుర్కోవడం కష్టం. ఈ నేపథ్యంలోనే అన్ని ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేయాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయ్యింది. ప్రజారోగ్యం కరోనా నియంత్రణపైనే దృష్టి నిలిపింది.