తిరుపతి జూలై 6
తిరుపతిలో కరోనాతో టీటీడీ ఉద్యోగి మృతి చెందారు. ఉద్యోగి మృతదేహాన్ని తిరుపతి మున్సిపల్ శ్మశాన వాటికలో జేసీబీతో గోతులు తవ్వి ఖననం చేశారు. ఆదివారం అధికారికంగా ప్రకటించిన వివరాల్లో ఈఉద్యోగి మరణం గురించి అధికారులు పేర్కొనలేదు. దాంతో టీటీడీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. కోవిడ్ మరణాలనూ దాయటంపై ఉద్యోగులు విస్మయం చెందుతున్నారు. ఇంతవరకు. 17 మంది టీటీడీ ఉద్యోగులు, పూజారులు, సెక్యూరిటి సిబ్బందికీ కరోనా పాజిటివ్ వచ్చిందని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.