YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా రోగుల కొంపముంచుతున్న విటమిన్‌ ‘డి’ లోపం

కరోనా రోగుల కొంపముంచుతున్న విటమిన్‌ ‘డి’ లోపం

హైదరాబద్ జూలై 6 
విటమిన్‌-డి లోపం ఉన్నవారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని, మృతుల్లోనూ వారే అధికమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సమృద్ధిగా డి-విటమిన్‌ ఉన్న వారికి కరోనా వచ్చినా.. త్వరగానే కోలుకుంటున్నట్లు తేలింది. సూర్యరశ్మి తగలకుండా ఇండ్లు, కార్యాలయాలకే పరిమితమయ్యే నగరవాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి-విటమిన్‌ లోపం ఉంటుందని పలు సర్వేలు తెలుపుతున్నాయి. కాగా గ్రేటర్‌ వాసులే ఎక్కువగా కరోనా బారిన పడుతుండటం గమనార్హం. డి-విటమిన్‌ తక్కువగా ఉన్న వారిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుందని హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటి తెలిపారు.విటమిన్‌ డి లోపం శాపంగా మారుతున్నది. దీని లోటు ఉన్నవారు సులువుగా కొవిడ్‌ బారిన పడుతున్నారు. అంతేకాదు మృత్యువాతపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. నగరంలో ప్రతి 100 మందిలో 70 నుంచి 80 మందిలో విటమిన్‌ డి లోపం ఉందని వివిధ సర్వేల్లో తేలింది.  సైటోకీన్స్‌ను క్రమబద్ధ్దీకరిస్తుంది  సాధారణంగా రోగిలో ఏదైన వైరస్‌ సోకినప్పుడు సైటోకీన్స్‌ అనేవి సైనికుల్లా పనిచేసి శరీరంలోకి వచ్చిన శత్రువుల్లాంటి వైరస్‌లపై దాడిచేసి వాటిని నశింపచేస్తాయి. కానీ మిటమిన్‌ డి లోపం ఉన్నవారిలో రోగిని వైరస్‌ నుంచి కాపాడాల్సిన ఈ సైటోకీన్సే ఎదురుదాడి చేసి శరీరంలోని ఇతర మూలకణాలను దెబ్బతీస్తాయి. దాని వల్ల రోగిలో రక్త కణాలు దెబ్బతిని గుండె, కిడ్నీలు, కాలేయం వంటి ప్రధాన అవయవాలు విఫలమవుతాయి. ఇది జరగకుండా సైటోకీన్స్‌ అనేవి సక్రమంగా పనిచేయాలంటే  విటమిన్‌ డి అవసరం.  విటమిన్‌ డి ఉన్న వారు త్వరగా కోలుకుంటున్నారు  ప్రస్తుతం నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే విటమిన్‌ డి లోపం ఉన్నవారే ఎక్కువగా కొవిడ్‌ వైరస్‌ బారినపడుతున్నారు. అలాగే మృతుల్లోనూ  ఈ విటమిన్‌ లోపం ఉన్నవారే అధికంగా ఉంటున్నారు. ఈ విటమిన్‌ సమృద్ధిగా ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు. వారిలో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటున్నది. సాధారణంగా  విటమిన్‌ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం కోల్పోవడం, గుండె వ్యాధులు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. సూర్య కిరణాలతో పాటు చేపలు, గుడ్లు, వెన్న, పాలు తదితర వాటిలో ఈ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. లోపం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుడి సలహా మేరకు తక్కువ డోస్‌లో కొంత కాలం పాటు విటమిన్‌ డి  మాత్రలను వినియోగించడం మంచిది. కనీసం అరగంట  ఎండలో ఉంటే సహజంగా ఇది లభిస్తుంది.

Related Posts