నెల్లూరు జూలై 6
నెల్లూరు జిల్లా న్యాయ సేవాదికార సంస్థ ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ న్యాయమూర్తి పి. జె సుధా బదిలీ సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. పై కార్యక్రమంలో భాగంగా హిజ్రా ల నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి , ప్రజా సంఘాలు, లీగల్ వాలంటీర్లు, న్యాయవాదులు, మరియు అదాలత్ కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హిజ్రా నాయకురాలు అలేఖ్య మాట్లాడుతూ సుధ మేడం కష్ట కాలంలో న్యాయ పరం గాను, చట్ట పరం గాను మాకు ఏంతో అండగా నిలబడి మాకు న్యాయం జరిగేలా కృషి చేశారు అని కొనియాడారు. సమాచార హక్కుచట్టం పరిరక్షణ కమిటీ నెల్లూరు జిల్లా న్యాయ సలహా దారులు వెంకయ్య మహిళా అధ్యక్షురాలు కె.ప్రవీణ, ఉపాధ్యక్షురాలు ఎన్ .రాజేశ్వరి, ఉపాధ్యక్షుడు సుధీర్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి చౌటూరు.శ్రీనివాసులు.కార్యదర్శి కే.మహీంద్రా ఆమెకు శ్యాలువా ,పూల బొకే లతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం చిట్టేటి.శ్రీనివాసులు మాట్లాడుతూ న్యాయమూర్తి సుధ మేడం సేవలు మాలాంటి యువతరానికి ఎంతో ఆదర్శ ప్రాయం అని,మేడం స్ఫూర్తి తో ఎంతో మంది చట్టపరం గా న్యాయ పరంగా తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అని కరోనా కారణంగా నిబంధనలను పాటిస్తూ కొద్దిమంది మాత్రమే రావాల్సి వచ్చింది అని మేడం గారు బదిలీ మీద వెళ్ళడం అందరికి చాలా విచారం కలిగిస్తుంది అని మేడం సేవలు ఎక్కడైనా స్ఫూర్తి దాయకంగా నిలవాలని ఆమెకు ఆ భగవంతుడు శక్తీ ప్రసాదించాలి అని అన్నారు.