YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాలుష్య ఒత్తిడి తగ్గించాలంటే మొక్కలు విరివిగా నాటాలి -మంత్రి పువ్వాడ

కాలుష్య ఒత్తిడి తగ్గించాలంటే మొక్కలు విరివిగా నాటాలి -మంత్రి పువ్వాడ

ఖమ్మం జూలై 6, 
పుడమిపై కాలుష్య ఒత్తిడిని తగ్గించేందుకు వ్యూహాత్మక కార్యాచరణలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని రూపొందించారని ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు విరివిగా నాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా రవాణా కార్యాలయంలో ఆ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలను నాటారు. అనంతరం కార్యాలయంలో తిరిగి పరిసరాలను పరిశీలించాలి. డ్రైవింగ్ ట్రాక్, ప్రహరీ, గ్రీనరి, శిథిలావస్థలో ఉన్న వాహనాలు పరిశీలించారు. మొక్కలు నాటేందుకు చాలా స్థలం ఉందని గ్రీనరిని మరింత పెంచాలని ఆదేశించారు. రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఆదర్శంగా ఉండాలన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
మానవ మనుగడకు మొక్కలే ప్రధాన వనరులు అని అన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు తమ తమ పరిధిలో మొక్కలు నాటలన్నారు.
రాష్ట్రంలో కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉన్న 23 శాతం గ్రీనరీని 33 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తోందని, అందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.
పుడమీ తల్లిపై పర్యావరణ ప్రభావం తీవ్రంగా ఉందని, దాని ప్రభావాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లలో 230 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టి గత ఐదేళ్లుగా అమలు చేస్తోందని, ఇటీవల ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఇది మంచి ఫలితాలను ఇస్తుందన్నారు.
వాతావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో మొక్కలను నాటడం కోసం సర్పంచ్ లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందని, ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించిందని తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసే సర్పంచ్ లపై చర్యలు తీసుకునే చట్టం దేశంలోనే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని వివరించారు.
కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , సుడా చైర్మన్ విజయ్ కుమార్ , మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి , తెరాస జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి కృష్ణ , ఆర్ టీ ఓ కిషన్ రావు , మరియు సిబ్బంది పాల్గొన్నారు

Related Posts