YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానులతోనే సమాన అభివృద్ధి - ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

మూడు రాజధానులతోనే సమాన అభివృద్ధి - ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

పత్తికొండ జూలై 6, 
పరిపాలన వికేంద్రీకరణని, సమన్యాయాన్ని, అన్ని ప్రాంతాల అభివృద్ధిని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ చేస్తున్న డ్రామాను రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలతో సహా మొత్తం 13 జిల్లాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్‌ఆర్‌ఐస్‌ ఫర్‌ అమరావతి అంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు పిలుపిచ్చినట్టు టీడీపీ చెప్పుకుంటోంది. నిజానికి 200 మంది కూడా మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా లేరు. చంద్రబాబు చెబుతున్న ప్రాంతంలో 200 మంది ఆందోళనకారులు కూడా లేరు. కేవలం బాబు బలవంతంగా తీసుకువచ్చిన మనుషులు తప్ప, రియల్‌ఎస్టేట్‌ ప్రయోజనాలు ఉన్న చంద్రబాబు వర్గం తప్ప వికేంద్రీకరణను ఏ ఒక్కరూ వ్యతిరేకించటం లేదు. చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు  రాయలసీమకు నీటి పరంగా కానీ, ఆత్మ గౌరవంగా పరంగా కానీ, ప్రజలకు అందే సంక్షేమ పధకాలు పరంగా కానీ చంద్రబాబు ఏనాడూ న్యాయం చేయలేదు.ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని చంద్రబాబుకు ఏనాడూ భావించలేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరాన్ని పరిపాలన పరమైన రాజధానిగా ప్రకటిస్తే కోర్టుకు వెళ్లారు. ఆంధ్ర రాష్ట్రం మొదటి రాజధాని అయిన కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తే అటు మండలిలోనూ ఇటు కోర్టుల ద్వారానూ మోకాలు అడ్డుపెడుతున్నారు. నిజానికి చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహిగా, రాయలసీమ ద్రోహిగా, రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి ద్రోహిగా  మిగలబట్టే ఆయన పార్టీ 2019 ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని రుచి చూసింది.  అయినా మారకుండా తాను, తన మిత్రులు, బంధువులు అమరావతి చుట్టూ కొనుగోలు చేసిన వేల ఎకరాల రేటు పెంచుకునేందుకే మిగతా ప్రాంతాలకు అభివృద్ధి అందకూడదని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మారాలని భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని మూడు రాజధానులు ప్రతి ప్రాంతం అభివృద్ధి దిశగా సాగుతుందని పత్తికొండ లోని స్వగృహంలో ఎమ్మెల్యే శ్రీదేవి విలేకరుల సమావేశంలో  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు
 

Related Posts