YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అధిష్ఠానంపై సిక్కోలు తమ్ముళ్ల గుర్రు

అధిష్ఠానంపై సిక్కోలు తమ్ముళ్ల గుర్రు

నామినేటెడ్‌ పోస్టుల పందేరంలో జిల్లాకు మొండి చేయి చూపడంతో అధికార పార్టీ నాయకులు, ఆశావాహుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 17 సంస్థలకు భర్తీ చేయగా జిల్లాకు మాత్రం ఒక్క పదవీ కేటాయించలేదు. నాలుగేళ్లుగా అదిగో ఇదిగో అంటూ కాలం గడిపారని..చివరి ఏడాదిలోనైనా అవకాశం కల్పిస్తారని ఎదురుచూస్తే ఇదేనా న్యాయమంటూ నాయకులు నిట్టూరుస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు లభించిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను పక్క జిల్లాల నేతలకు కట్టబెట్టారని...నామినేటెడ్‌ పదవుల్లోనైనా న్యాయం చేస్తారనుకున్నా అధిష్ఠానం పట్టించుకోకపో వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లా స్థాయిలో బోర్డులు, సంస్థలకైనా నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. మంత్రి అచ్చెన్న, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఎదుట చాలామంది నేతలు తమ ఆవేదనను వెళ్లగక్కారు.

పదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో తమకు నామినేటెడ్‌ పదవుల రూపంలో న్యాయం జరుగుతుందని జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు ఎంతగానో సంతోషప డ్డారు. నాలుగేళ్లయినా పదవుల ఊసు లేకపోవడంతో కేడర్‌ నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. గతన ఏడాది ఆఖర్లో పార్టీ జిల్లాల అధ్యక్షులతో చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తున్నా మని... రాష్ట్రస్థాయిలో 108 వరకు కీలక కార్పొరేషన్‌ పోస్టులు, వందల్లో ఇతర నామినేటెడ్‌ పదవులు ఉన్నట్లు అధినేత చదివి వినిపించడంతో పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు.

గతంలో చంద్రబాబు, జిల్లా మంత్రులు తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే సమయం వచ్చిందని, తమకు ఏదొక కుర్చీ ఖాయమని పలువురు ఆశావహులు నమ్మకం పెంచుకున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అరసవల్లి దేవస్థానం, రిమ్స్‌ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ, ఆర్టీసీ ప్రాంతీయ ఛైర్మన్లు, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌, సభ్యులతోపాటు రాష్ట్రస్థాయిలో హౌసింగ్‌బోర్డు, ఖాదీ బోర్డు, టీటీడీ, గిరిజన కార్పొరేషన్‌ తదితర పోస్టుల్లో ఏదో ఒకటి రాకపోతుందా అని లెక్కలు వేసుకున్నారు.. కానీ ఈఆశలు నెరవేరలేదు. తాజాగా నామినేట్‌ చేసిన జాబితాలో జిల్లా నుంచి ఏ నేత పేరూ లేకపోవడంతో విస్మయానికి గురయ్యారు. విజయనగరం ఆర్టీసీ జోనల్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసిన తెంటు లక్ష్ముంనాయుడు కంటే సీనియర్లు జిల్లాలో ఉన్నారని...అటువంటి వారిని పక్కన పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తు న్నారు.

గతేడాది జిల్లాలో టీడీపీ సులువుగా గెల్చుకునే రెండు ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి అవకాశం వచ్చింది. ఇందులో ఒకటి స్థానిక సంస్థల కోటా, మరొకటి పట్టభద్రుల కోటా. ఈ రెండు స్థానాలను ఇతర జిల్లా నేతలకు కేటాయించడంతో స్థానిక నాయకులకు అవకాశం లేకుండా పోయింది. సీనియర్‌ నేతలైన బగ్గు లక్ష్మణరావు, కోళ్ల అప్పలనాయు డు, చౌదరి బాబ్జి ఇలా పలువురు పోటీ పడ్డారు. సీటు ఇవ్వాలంటూ వీరితోపాటు మరో పది మంది వరకు దరఖాస్తు చేశారు. కానీ వీరెవరికీ టిక్కెట్‌ రాలేదు. చివరి నిమిషంలో విజయనగరం జిల్లాకు చెందిన శత్రుచర్ల విజయరామరాజును తెరపైకి తెచ్చి ఆయనకు సీటు ఇచ్చారు.

ఆయనకు సహకరించాలని అధిష్ఠానం జిల్లా నేతలను కోరింది. భంగపడ్డ ఆశావహులకు నామినెటెడ్‌ పోస్టులు ఇస్తామని ఆశ చూపించింది. అయినా కోళ్ల అప్పలనాయుడు బెట్టు వీడకపోవడంతో మంత్రులు, జిల్లా పార్టీ ముఖ్యనేతలు ఆయన్ను కలిసి సీఎం ద్వారా న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. ఆ తర్వాత పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీకి పలువురు పార్టీ నేతలు ఆసక్తి చూపారు. దీన్ని తీసుకువెళ్లి విశాఖ నగరానికి చెందిన బీజేపీ నేత మాధవ్‌కు కట్టబెట్టారు.

రాష్ట్రస్థాయిలో హౌసింగ్‌ బోర్డు, ఆర్టీసీ, ఖాదీ బోర్డు, ఎస్టీ కార్పొరేషన్‌, వక్ఫ్‌బోర్డు, స్టేట్‌ మార్కెట్‌ కమిటీ, తెలుగు అకాడమీ, టీటీడీ బోర్డు మెంబర్ల వరకు ఇంకా అనేక పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అరసవల్లి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు ఖాళీగా ఉంది. ఇందులో పది మంది వరకు డైరెక్టర్లను ప్రభుత్వం నామినేట్‌ చేయవచ్చు. అలాగే రిమ్స్‌ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌, హిరమండలం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌, ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్‌, ఖాదీ బోర్డులో కూడా పదవులు జిల్లా నేతలతో భర్తీ చేయాల్సి ఉంది. వివిధ సామాజిక వర్గాల నేతలు సమత్యులత కోణంలో కొన్ని పోస్టులు ప్రభుత్వం భర్తీ చేస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు. జిల్లా పార్టీలో కీలక నేతలు ఒత్తిడి తెచ్చి అధిష్ఠానం ద్వారా ఈ చివరి ఏడాదిలో అయినా న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జిల్లాలో ఆశావహులంతా జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మంత్రి అచ్చెన్నాయుడుకు విషయాన్ని చేరవేశారు. నామినేటెడ్‌ పదవుల్లో అన్యాయంపై నేతలు, కార్యకర్తలు తనను ప్రశ్నిస్తున్నారని, వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని వివరించారు. దీంతో తాను సీఎంతో మాట్లాడతానని, మంగళవారం రాత్రి భర్తీ చేసిన వివిధ కార్పొరేషన్ల పరిధిలో డైరెక్టర్ల పోస్టులు కొన్ని ఇంకా ఖాళీగా ఉన్నందున ఈలోగా జిల్లా నుంచి పేర్లు ప్రతిపాదించి పంపితే న్యాయం జరిగేలా చూస్తానని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు

Related Posts