YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జమిలి ఎన్నికలపై సబ్బం ఆశలు

జమిలి ఎన్నికలపై సబ్బం ఆశలు

విశాఖపట్టణం, జూలై 7, 
సబ్బం హరి సీనియర్ నేత…. ఆయనకు రాజీకీయాలు బాగా తెలుసంటారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన సబ్బం హరి చంద్రబాబును విపరీతంగా ప్రశంసిస్తున్నారు. ఆయనను సబ్బంహరి వారియర్ గా కొనియాడుతున్నారు. సొంత పార్టీ అధినేతపై ప్రశంసలు కురిపిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ సబ్బంహరి జమిలి ఎన్నికలపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లు కన్పిస్తుంది. పదేళ్ల పాటు ఎంపీగా ఉన్న సబ్బంహరికి ఢిల్లీ నుంచి ఉప్పు అందినట్లుంది.సబ్బంహరి జమిలి ఎన్నికలు వస్తాయని ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు. 2022 లో జమిలి ఎన్నికలు వస్తాయని సబ్బం హరి జోస్యం చెబుతున్నారు. రెండేళ్లకు ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తుందని సబ్బం హరి చెబుతున్నారు. దీంతో పాటు బీజేపీ అనుసరిస్తున్న విధానాలు కూడా జమిలీ ఎన్నికల దిశగానే వెళుతున్నాయని ఆయన అంటున్నారు. ఇంతకీ జమిలీ ఎన్నికలపై సబ్బం హరి హోప్స్ ఎందుకు పెట్టుకున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.జమిలి ఎన్నికలు వస్తే రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందన్నది సబ్బం హరి అంచనా. ఏడాదిలోనే జగన్ కు పది శాతం మంది ప్రజలు దూరమయ్యారంటున్నారు. 2022 నాటికి మరో పదిహేను శాతం మంది దూరమయితే టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. దీంతో పాటు ఈసారి ఎన్నికల్లో విశాఖపార్లమెంటు నుంచి పోటీ చేయాలన్నది సబ్బం హరి ఆలోచనగా ఉంది.గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి సబ్బం హరి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎంపీగా పోటీ చేయాలన్నది ఆయన ఆలోచన. విశాఖ లేదా అనకాపాల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీకి ఆయన రెడీ అవతున్నారంటున్నారు. అందుకే ఢిల్లీ స్థాయి నేతలతో టచ్ లో ఉండి సబ్బం హరి జమిలి ఎన్నికలపై ఆరా తీస్తున్నారట. మొత్తం మీద సబ్బంహరి జమిలి ఆశలు నెరవేరతాయా? లేదా? అన్నది పక్కన పెడితే ఎన్నికలు వచ్చినా గెలుస్తారో? లేదో? ముఖ్యమని ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Related Posts