YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పాలకొల్లుపైనే పవన్ ఆశలు

పాలకొల్లుపైనే పవన్ ఆశలు

ఏలూరు, జూలై 7, 
మొగల్తూరు..ఈ పేరు వినగానే మెగా వైబ్రేషన్స్ మొదలవుతాయి. ఎందుకంటే ఇది చిరంజీవి సొంత ఊరు. ఆయన చదువు అంతా ఇక్కడే సాగింది. ఇక చిరంజీవి సొంత ఇల్లు ఒకపుడు ఇక్కడ ఉండేది. తరువాత అమ్మేసినా కూడా మెగా ఫ్యామిలీ సొంత ఊరు అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ సీటు పరిధిలో ఉంది. రాజకీయాల ఊసు ఎలా ఉన్నా మొగల్తూరు పేరు మెగాస్టార్ సినిమాల్లో చాలా సార్లు మారుమోగింది. చిరంజీవి నోటి వెంట డైలాగులు పలికించింది. ఇక చిరంజీవి హీరోగా మంచి పీక్స్ లో ఉన్నపుడు మొగల్తూరు మొనగాడు పేరిట ఒక సినిమా కూడా తీయాలని సన్నాహాలు చేశారు, కానీ అది పట్టాలెక్కలేదు. ఇవన్నీ ఎందుకంటే ఇప్పటి రాజకీయ కధలో మొగల్తూరు మొనగాడు చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ అంటున్నారు.నిజానికి పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల వేళ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని గోదావరి జిల్లా జనసైనికుల అభిప్రాయం. ఆయన భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేశారు. అయితే ఆయనకు సురక్షితమైన స్థావరం నర్సాపురం శాసనసభ సీటు అని నాడే పార్టీ నాయకులు చెప్పారట. అయితే అన్నయ్య నాగబాబు నర్సాపురం ఎంపీగా పోటీలో ఉండడంతో పవన్ భీమవరం నుంచి పోటీకి దిగారు, నర్సాపురం ఎంపీ సీటు పరిధిలో భీమవరం కూడా ఉంది. మరీ డైరెక్టుగా ఒకే చోట నుంచి పోటీ ఎందుకని పవన్ కల్యాణ్ అనుకుని భీమవరం వైపు వెళ్లారు. అయితే అక్కడ వైసీపీ బలంగా ఉంది, దాంతో పవన్ కల్యాణ్ ఓటమి పాలు అయ్యారు.ఇక మొగల్తూరు నర్సాపురం లో ఉంది ఇక్కడ ముదునూరు ప్రసాదరాజు వైసీపీ ఎమ్మెల్యేగా ఇపుడు గెలిచారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు. అంతే కాదు 2012లో ఉప ఎన్నికల్లో కూడా ఓటమి పాలు అయ్యారు. ఈసారి కూడా ఆయనకు అయిదారు వేల స్వల్ప మెజారిటీ దక్కిందని అంటున్నారు. ఇక విడిగా పోటీ చేసిన జనసేన, టీడీపీలకు రెండూ కలిపి డెబ్బై వేల వరకూ ఓట్లు పోల్ అయ్యాయట.ఇక్కడ జనసేన బలంగా ఉండి 20 వేల ఓట్లు సాధించింది. దాంతో పవన్ కల్యాణ్ సెంటిమెంట్ గా కూడా భావించి ఇక్కడ నుంచి పోటీకి దిగాలనుకుంటున్నారుట. 2024 నాటికి కచ్చితంగా గెలుపు ఖాయమని కూడా అంచనా వేసుకుంటున్నారుట. మళ్లీ ప్రసాదరాజుకే ఇక్కడ టికెట్ వైసీపీ ఇస్తుంది. కాపుల ప్రాబల్యం ఉన్న చోట పవన్ లాంటి చరిష్మాటిక్ లీడర్ దిగితే గెలుపు ఖాయమని అంటున్నారు. మరి చూడాలి, పవన్ మొగల్తూరు మొనగాడు అవుతాడా. మెగా కుటుంబాన్ని ఈ ఊరు ఆదుకుని ఎమ్మెల్యేగా గెలిపిస్తుందా అన్నది కూడా తేలాలి.

Related Posts