YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి ఆరోగ్యం దేశీయం

బెంగళూర్ వదలొద్దు : మంత్రి వేడుకోలు

బెంగళూర్ వదలొద్దు : మంత్రి వేడుకోలు

బెంగళూర్, జూలై 7, 
లాక్‌డౌన్‌ చేస్తారనే భయం వద్దు.  మరోసారి లాక్‌డౌన్‌ అనేది అసత్యం. ఎవరూ సొంతూళ్లకు వెళ్లొద్దు. బెంగళూరులోనే క్షేమంగా ఉండండి’ అని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రజలను కోరారు. బెంగళూరులో మరోసారి లాక్‌డౌన్‌ ఉంటుందని వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. రెండురోజుల క్రితం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ విధించబోదని స్పష్టం చేశారు. ఇదే మాటను ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా చెప్పారన్నారు. ‘బెంగళూరులో కరోనా అధికమైందని, లాక్‌డౌన్‌ చేస్తారని ప్రజలు బెంగళూరు విడచి ఇతర గ్రామాలకు వెళుతున్నారు. దీనిద్వారా మిగిలిన జిల్లాలు, గ్రామాల్లో వైరస్‌ బెడద అధికమైంది. ప్రజలు దయచేసి బెంగళూరులోనే క్షేమంగా ఉండాలి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేయడం లేదు’ అని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం కర్ఫ్యూ మాత్రం ఉంటుందన్నారు.  రోజూ ఐదారు పోలీస్‌ స్టేషన్ల సీల్‌డౌన్‌  బెంగళూరులో కరోనా రోగులకు బెడ్‌ల కొరత లేదని హోంమంత్రి తెలిపారు. పాజిటివ్‌గా తేలి ఆరోగ్యంగా ఉన్నవారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్లో చేర్పిస్తామని చెప్పారు. బాధితుల తరలింపునకు బెంగళూరులో మరో 500 అంబులెన్స్‌ల అవసరం ఉందని అన్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో ప్రతి రోజు ఐదారు పోలీస్‌ స్టేషన్‌లు సీల్‌డౌన్‌ అవుతున్నాయని వాపోయారు. పోలీసులకు విస్తృతంగా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.అయితే ఇది బెంగళూరు నగరానికి చెందిన సమస్య మాత్రమే కాదు. భారతదేశంలో అన్ని నగరాలూ ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. గత 40 ఏళ్లుగా పల్లెల నుంచి పట్టణాలకు వలసబాట పట్టిన వలస కార్మికులు ఇప్పుడు వరుస లాక్ డౌన్లతో గుండె ధైర్యం చెదిరి, నగరం ఇక బతుకునివ్వదని నిర్ణయించుకుని కుటుంబాలతో సహా మళ్లీ గ్రామాలకు చేరుకుంటున్నాయి.
ఈ పరిణామంతో హైదరాబాద్ బోసిపోతోంది. ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది ప్రజలు అటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నవంబర్ వరకు ఆహార ధాన్యాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో జనం దాన్ని మరోలా అర్థం చేసుకుని లాక్ డౌన్ కొనసాగుతుందని, ఇక ఇక్కడ బతకాలంటే పనులు దొరకవని పట్టణాలనుంచి పల్లెటూళ్లకు వలస వెళుతున్నారు.  దీంతో హైదరాబాద్ నుంచి గత వారంరోజులుగా లక్షలాది మంది ప్రజలు  తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. నగరంలో ఎక్కడ చూసినా టు లెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. దాదాపు రెండు లక్షల అద్దె ఇళ్లు ఖాళీ అయిపోయాయని వార్తలు.

Related Posts