YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బెంగాల్ కు కమలం గురి..

బెంగాల్ కు కమలం గురి..

కోల్ కత్తా, జూలై 7,
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ తర్వాతే ఎవరైనా. మోదీ, షాల ద్వయం చేతిలో పార్టీ పడ్డాక టెక్నాలజీని బీజేపీ సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. 2014, 2019 ఎన్నికలలో మోదీ ప్రభుత్వం స్పష్టమైన మెాజరిటీతో రావడానికి సోషల్ మీడియా కూడా ఒక కారణమని చెప్పక తప్పదు. మోదీ ఉపయోగించుకున్నంతగా సోషల్ మీడియాను ఏ రాజకీయ నేత ఉపయోగించుకోరన్నది వాస్తవం. తాజాగా పశ్చిమ బెంగాల్ లోనూ పగ్గాలు చేపట్టేందుకు సోషల్ మీడియాను వేదికగా బీజేపీ ఉపయోగించుకుంటోంది.పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్ లో బీజేపీ జెండా పాతేందుకు ప్రయత్నిస్తుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీలో నూతనోత్తేజాన్ని నింపాయి. ఇప్పటికే పదేళ్ల నుంచి మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్ ను ఏలుతున్నారు. మమత సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను బీజేపీ పక్కాగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గత కొద్ది ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ పై బీజేపీ దృష్టి పెట్టింది. ప్రధానంగా అమిత్ షా ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ నేతలతో టచ్ లో ఉంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.పశ్చిమ బెంగాల్ లో స్పేస్ ఉన్నట్లు కమలనాధులు గుర్తించారు. అక్కడ ఒకప్పుుడు బలంగా ఉన్న కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు చాలావీక్ గా ఉన్నాయి. గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పాలి. ఆ రెండు పార్టీలూ మమతతో కలసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నంలో పడింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది. తన సోషల్ మీడియా వింగ్ ద్వారా మమత బెనర్జీ పై విరుచుకుపడుతోంది.మమత బెనర్జీ తీసుకుంటున్న నిర్ణయాలు, కోవిడ్ సందర్బంగా ఒకవర్గం ప్రజలకు అనుకూలంగా వ్యవహరించిన తీరును కూడా బీజేపీ చక్కగా వినియోగించుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా మమత బెనర్జీ పై చేస్తున్న ఆరోపణలతో ఆమె కూడా ఒకింత ఆందోళనకు గురయ్యారు. హడావిడిగా ప్రశాంత్ కిషోర్ ను పిలిపించారంటే టీఎంసీ బీజేపీ కన్నా సోషల్ మీడియా విభాగంలో వెనకబడి ఉందని అంగీకరించినట్లే నంటున్నారు. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీని దెబ్బకొట్టాలన్న వ్యూహంతో బీజేపీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసింది

Related Posts