YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రమణదీక్షితుల ట్వీట్ కలకలం

రమణదీక్షితుల ట్వీట్ కలకలం

తిరుమల, జూలై 7, 
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి సంచలన ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘ఆల్ ది బెస్ట్ స్వామీ.. ఆ దేవుడు మీకు విజయాన్ని అందించేలా దీవించాలని కోరుకుంటున్నాను. మీ విజయం సనాతన ధర్మానికి విజయంగా భావిస్తున్నాం.. ఉత్తరాంఖండ్ తర్వాత తిరుమల ప్రభుత్వ చెర నుంచి విడుదల కావాలని ఆకాంక్షిస్తున్నాను’అన్నారు. రమణ దీక్షితులు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఇటు ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తన ట్వీట్‌లో ఉత్తరాఖండ్‌లో నాలుగు ధామాలు, మరో 51 ఆలయాలకు సంబంధించిన కేసుల్లో కోర్టు ఆర్డర్‌లు రిజర్వ్ చేసిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఆయన కోర్టులో కేసు వేశారట. తర్వాత కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంతో ఈ కేసుల విచారణ నిలిచిపోయిందని.. ఇప్పుడు ఆర్డర్లు రిజర్వ్ చేశారన్నారు. బీజేపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీనికి సహకరించినప్పటికి.. తనకు తెలిసి ఇదే ఫాస్టెస్ కోర్టు కేసన్నారు. గౌరవనీయులైన సీజే, జడ్జికి కంగ్రాట్స్ చెప్పారు.టీటీడీ పాలనా నిర్వహణపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని పిటిషన్‌లో కోరారు.లా విద్యార్థి సత్య సబర్వాల్‌తో కలిసి ఈ పిటిషన్ వేసినట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీటీడీని తప్పించాలని.. ఆలయ నిధులు కూడా దుర్వినియోగం కాకుండా అడ్డుకోవాలని తన పిటిషన్‌లో ప్రస్తావించారు. దీనిపై విచారణ జరుగుతోంది. అయితే ఇప్పుడు రమణ దీక్షితులు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Related Posts