YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పసిడి బంగారం దిగొచ్చింది

పసిడి బంగారం దిగొచ్చింది

ముంబై, జూలై 7, 
సిడి వెలవెలబోతోంది. బంగారం ధర పడిపోతూనే వస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది ఊరట కలిగించే అంశం. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర తగ్గడం గమనార్హం. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది.  దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో మంగళవారం పసిడి ధర పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గింది. దీంతో ధర రూ.46,900కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.220 తగ్గుదలతో రూ.48,100కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర రూ.1090 పెరిగింది. రూ.49,600కు ఎగసింది.హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.140 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,100కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.140 తగ్గుదలతో రూ.50,710కు క్షీణించింది.పసిడి ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1090 పెరిగింది. దీంతో ధర రూ.49,600కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.08 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1795 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.22 శాతం పెరుగుదలతో 18.62 డాలర్లకు చేరింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts