YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ రూల్స్ మార్పు

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ రూల్స్ మార్పు

హైద్రాబాద్, జూలై 7, 
తల్లిదండ్రలు ఎవరైనా పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలని కోరుకుంటారు. మరీముఖ్యంగా ఆడ పిల్ల పుడితే.. వారికి ఆర్థికంగా భద్రత కల్పించాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. అందుకే అమ్మాయి పుట్టిందనగానే వారి పేరుపై బ్యాంక్‌లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు.అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆడ పిల్ల పుడితే.. వారిని సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌‌లో చేర్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పథకం ఇది. మిగతా స్కీమ్స్‌తో పోలిస్తే దీనికే ఎక్కువ వడ్డీ లభిస్తోంది. ఇందులో చేరడం వల్ల అమ్మాయి చదువు, పెళ్లి వంటి వాటికి స్కీమ్ డబ్బులు ఉపయోగపడతాయి.సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌‌లో చేరిన వారు 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలి. పదేళ్లలోపు ఆడపిల్లలు ఈ పథకంలో చేరొచ్చు. ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలకు స్కీమ్‌లో చేరేందుకు అనుమతి ఉంటుంది. అయితే ఇప్పుడు పదేళ్లు దాటినా కూడా పోస్టాఫీస్‌‌కు వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు. అయితే జూలై 31 వరకు మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం రూ.250 డిపాజిట్ చేసిన సరిపోతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. వడ్డీ రేటు తగ్గొచ్చు. పెరగొచ్చు. లేదంటే స్థిరంగా కూడా ఉండొచ్చు.సుకన్య సమృద్ధి అకౌంట్‌లో ప్రతి నెలా మీకు నచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటూ వెళ్లొచ్చు. మీరు ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెలితే.. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం.. మీమకు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.64 లక్షలు వస్తాయి. ఇందులో మీరు డిపాజిట్ చేసిన మొత్తం రూ.22.5 లక్షలు అవుతుంది. దీనిపై మీకు వచ్చే వడ్డీ రూ.41.36 లక్షలు.

Related Posts