YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

13 న తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు

13 న  తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి గత నెలలో నిర్వహించిన ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు ఈ నెల 13 న విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఈ రోజు ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది. 13 ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యాలయంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేస్తారని అందులో పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలను న్యూస్‌ పేపర్లలోనూ ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు ఈ వెబ్‌సైట్లు లేక యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Related Posts