YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నేను పక్కా హిందూవునే : పుట్టా సుధాకర్ యాదవ్

నేను పక్కా హిందూవునే : పుట్టా సుధాకర్ యాదవ్

విజయవాడ: టీటీడీ చైర్మన్ గా నియమించినదుకు సీఎం కి పుట్టా సుధాకర్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. గురువారం నాడు అయనమీడియాతో మాట్లాడారు. టీటీడీ చరిత్రలోనే ఒక యాదవ్ ని నియమించటం ఇదే మొదటిసారని అన్నారు. సీఎం చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. నా మీద కొంత మంది ప్రచారం చేస్తున్నారు.నేను హైందవేతరునని. దాన్ని అయన కొట్టివూసారు. ఆ రోజు నేను ఒక తిరుణాలకి వెళ్లి ఎద్దుల పందెం ప్రారంభించి వెళ్ళిపోయాను. మా కార్యకర్త ఎదో ఫ్లెక్సీ వేసుకున్నారని స్పష్టతనిచ్చారు. బీసీలకు పదవి ఇస్తే బీజేపీ, వైకాపా నేతలు ఓర్వలేక ప్రచారం చేస్తున్నారు. మా కుల దైవం శ్రీ కృష్ణుడు, మా ఇష్ట దైవం వెంకటేశ్వరస్వామి. నేను హిందూ మతం కోసం చాలా చేశాననని వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కాలనీ ల్లో ఎనో దేవాలయాలు నిర్మించానని అన్నారు.

Related Posts