విజయవాడ జూలై 7,
విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. కరోనా బాధితులకు అందుతున్న ఆహారం పై అరా తీసారు. క్వారంటైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. ఎవరు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది. కరోనా బాధితులకు సదుపాయాలు, మందులు పంపిణిలో రాజీ పడవద్దు. బాధితుల ఆరోగ్య పరిస్థితిల పై ఎప్పటికప్పుడు తెలుచుకొని అవసరమైన సహాయం అందించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని అన్నారు. రాష్ట్రంలో క్వారం టైన్ సెంటర్ లో ఉంటున్న వారికీ ఏ లోటు రానివ్వం. రాష్ట్రంలో మైల్డ్ కరోనా పాజిటివ్ కేసులకు వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల్లో 4వేల బెడ్స్ సిద్ధం చేసాం. రోజంతా వైద్యం అందడానికి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు , గ్రామ, వార్డ్ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించడానికి అదేశాలు ఇచ్చాం. కరోనా పై ప్రజల్లో ఉన్న భయం దోళనలు తొలగిపోయోలా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు లు ధరించాలి.. బౌతిక దూరం పాటించాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేయండి. ఇళ్లల్లోనే ఉండి తగిన వైద్యం చేయిం చు కునేలా ప్రజల్లో విస్తృతం గా అవగాహన కలిపించాలని సీఎం అదేశించారని అన్నారు.