YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఉద్యోగాలపై కరోనా లాక్ డౌన్ దెబ్బ

ఉద్యోగాలపై కరోనా లాక్ డౌన్ దెబ్బ

న్యూఢిల్లీ జులై 7 
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం విధించిన లాక్డౌన్ దేశవ్యాప్తంగా చిన్నాచితకా ఉద్యోగులపై దెబ్బకొట్టింది. లాక్డౌన్ సమయంలో దాదాపు 12 కోట్లకు పైగా మంది ఉద్యోగాలను కోల్పోయారు. అయితే, గమ్మత్తైన విశేషమేమిటంటే.. ఈ ఉద్యోగాలలో 75 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు లాక్డౌన్ సడలించిన తర్వాత తిరిగి వచ్చాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం.. మే నెలలో 2 కోట్లకు పైగా, జూన్ నెలలో 7 కోట్లకు పైగా ఉద్యోగాలు తిరిగి వచ్చాయి. అంటే.. ఏప్రిల్‌లో కోల్పోయిన 12 కోట్ల ఉద్యోగాల్లో.. 9.1 కోట్ల ఉద్యోగాలు తిరిగి వచ్చాయన్నమాట.కరోనా కారణంగా దేశాంలో 2019-20 లో కంటే తక్కువ ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయి. 2019-20లో దేశంలో 404 కోట్ల ఉద్యోగాలు ఉండగా.. 2020 జూన్‌లో 37.4 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. అంటే, గత ఏడాది వరకు ఉద్యోగాలు పొందిన వారిలో 7.4 శాతం మందికి ఇంకా ఉపాధి లేదని అర్ధమవుతుంది. సీఎంఐఈ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. జూన్ నెలలో 63 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. 2020 జూన్ లో వచ్చిన 7 కోట్ల ఉద్యోగాల్లో 4.44 కోట్ల ఉద్యోగాలు డైలీ వేజర్స్ అందుకున్నారు. ఇందులో చిన్న దుకాణదారులు, రోజువారీ కూలీలు ఉన్నారు. ఇదే సమయంలో మే నెలలో వచ్చిన మొత్తం ఉద్యోగాలలో డైలీ వేజర్స్ వాటా 68 శాతంగా ఉన్నది. సీఎంఐఈ సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ ప్రకారం.. డైలీ వేజర్స్ భారతదేశంలోని మొత్తం ఉద్యోగాలలో 75 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ఏప్రిల్‌లో లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ, 90 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు రోజువారీ సంపాదించేవారికి వెళ్ళాయి. లాక్డౌన్ తెరిచినప్పుడు కూడా వీరి ఉద్యోగాలే ఎక్కువగా తిరిగి వచ్చాయని స్పష్టమవుతుంది.ఒకవైపు లాక్డౌన్ లో ప్రతి రంగంలో ఉద్యోగాలు తగ్గగా.. ఇందుకు విరుద్ధంగా వ్యవసాయంలో ఉద్యోగాలు పెరిగాయి. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే వ్యవసాయంలో 14 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. జూన్‌ నెలలో ఈ రంగంలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. 2019-20 లో దేశంలో సగటున 11 కోట్లకు పైగా ప్రజలు వ్యవసాయంలో పనిచేశారు. వీరి సంఖ్య 2020 జూన్‌ నెలకు వచ్చే సరికి 13 కోట్లకు పెరిగింది. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు.2019-20 లో దేశవ్యాప్తంగా 8.6 కోట్ల మంది మంత్లీ సాలరీడ్ ఉద్యోగాల్లో ఉన్నారు. అయితే, 2020 మే నెలలో వీరి సంఖ్య 7 కోట్లకు తగ్గింది. ఏప్రిల్, మే నెలల్లో 3 కోట్ల పైగా ఉద్యోగాలు పోయాయన్నమాట. అయితే, సమస్య ఏమిటంటే, ఉద్యోగాలు కోల్పోయిన వారిలో జూన్‌లో కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు తిరిగి వచ్చాయి. కరోనా వ్యాప్తి నివారణకు దేశంలో నాలుగుసార్లు లాక్‌డౌన్ లు అమలుచేయగా.. మొదటి లాక్డౌన్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు.. రెండో లాక్డౌన్ ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు కొనసాగింది. దీని తరువాత మే 4 నుంచి మే 17 వరకు మూడవ లాక్డౌన్.. మే 18 నుంచి మే 31 వరకు నాలుగో లాక్డౌన్ అమలుచేశారు. జూన్ 1వ తేదీ నుంచి దేశంలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసి అన్లాక్ ప్రక్రియ ప్రారంభించారు. రాబోయే 6 నెలలు ఎక్కడా పని లేకకపోతే.. అది నెలవారీ వేతనం ఉద్యోగులకు సుమారు రూ.2 లక్షల కోట్ల నష్టానికి దారితీస్తుందని ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ అధ్యయనంలో అంచనా వేశారు.

Related Posts