దర్శి జూలై 7
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామం లో మంగళవారం బ్రాందీ షాప్ మూసివేయాలంటూ ధర్నా నివహించారు. ఆ సమయం లో షాప్ మూసివేసి మహిళలు వెళ్లిన వెంటనే మరల షాప్ తీసి అమ్మకాలు ప్రారంభించారు. విషయం తెలిసిన మహిళలు గ్రామ సచివాలయం దగ్గర మరల ఆందోళన చేపట్టి బొద్దికూరపాడు లో ఇప్పటి వరకు కరోనా వైరస్ లేదని, ఇప్పుడు బ్రాందీ కోసం పరిసర గ్రామాలవారు ఇక్కడకు మందు కోసం వస్తున్నారని ఆలా వస్తే మన వూరికి కూడా కరోనా వైరస్ వస్తుందని ఇది మాకు ఇష్టం లేదని తెలియజేస్తూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆందోళన చేపట్టి గ్రామ సచివాలయం లో కార్యదర్శి కి వినతి పత్రం అందచేశారు. తదుపరి బ్రాందీ షాప్ వద్దకు వెళ్లి మరల ఆందోళన చేపట్టి షాప్ మూసివేయించి షాప్ ముందు కంప వేసి అక్కడ ఉన్న ఖాళీ అట్టపెట్టలు తగులబెట్టడం జరిగింది. యిప్పటికైనా తమ గ్రామం లో బ్రాందీ షాప్ మూసివేసి తమకు, తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.