విజయవాడ జూలై 7
: అంతా సజావుగా జరిగితే 30 లక్షల మంది మహిళలకు సొంతింటి కల సాకారం అయ్యేదని.. కానీ అడ్డుకున్నారని మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. నిజంగా ఈరోజు ఒక బ్లాక్ డే అని.. మహిళలకు ఇవ్వవలసిన ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా పిటిషన్లు వేస్తూ మహిళలకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో మహిళలు ఎంతగానో ఇబ్బంది పడ్డారన్నారు. ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో చేసిందన్నారు. మహిళ సాధికారత జగనన్న ప్రభుత్యంతోనే సాధ్యమని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం దేశంలోనే ఇదే ప్రథమమన్నారు. ఏపీ ప్రభుత్యం మహిళ సాధికారత కోసం తీసుకుంటున్న కార్యక్రమాలపై యావత్ దేశం మన రాష్ట్రం వైపు చూస్తోందని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు