YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ఆ ఆస్పత్రి పేరు ఏంటీ...

ఆ ఆస్పత్రి పేరు ఏంటీ...

హైద్రాబాద్, జూలై  7, 
పరకాల చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు చురుగ్గా స్పందించారు. ఆ ఆస్పత్రి ప్రవర్తించిన తీరు దారుణమని, కరోనా విషయంలో మానవత్వం మంటగలిసిందని విమర్శించారు. ‘అంత గొప్ప’ ఆస్పత్రి పేరు బయట పెట్టాలని పరకాలను కోరారు.హైదరాబాద్‌లో కరోనా చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రి వేసిన బిల్లు విస్మయం కలిగిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ బయటపెట్టారు. ఈ మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ పేద్ద ప్రైవేటు ఆస్పత్రి కరోనా చికిత్సలో భాగంగా 9 రోజులకు ఏకంగా రూ.పదిన్నర లక్షల బిల్లు వేసిందని చెప్పారు. ఆ కరోనా బాధితుడి వయసు 83 అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అతణ్ని ఇంకా డిశ్చార్జి చేయలేదని చెప్పారు. అయితే, ఆస్పత్రి వేసిన బిల్లును కట్టేందుకు బాధితుడి కుటుంబ సభ్యులు 12 గంటల సమయం అడిగినా ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోలేదని ఆరోపించారు. ‘‘బిల్లు కడితే ఇప్పుడు కట్టేయండి లేదంటే రోగిని వెంటనే తీసుకెళ్లిపోండి’’ అని వారు తెగేసి చెప్పారని ట్వీట్ చేశారు.  అయితే, పరకాల చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు చురుగ్గా స్పందించారు. ఆ ఆస్పత్రి ప్రవర్తించిన తీరు దారుణమని, ఇందులో మానవత్వమే లేదని విమర్శించారు. ‘అంత గొప్ప’ ఆస్పత్రి పేరు బయట పెట్టాలని పరకాలను కోరారు. కరోనా విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల లూటీపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైన విషయాన్ని మరో నెటిజన్ గుర్తు చేశాడు. అయితే, అత్యధికమంది నెటిజన్లు ఇలా లక్షల కొద్దీ బిల్లు వేసిన హాస్పిటల్ పేరు చెప్పాలని ఉత్సుకతగా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో పరకాల మళ్లీ మరో ట్వీట్ చేశారు.  ‘‘లక్షల బిల్లు వేసిన ఆస్పత్రి పేరు తెలుసుకోవాలనే ఆత్రుత ఉండడం అర్థం సరైందే. కానీ, ఆ ఆస్పత్రి పేరు బయటపెట్టి నేను ఆ కరోనా పేషంట్‌కు హాని తలపెట్టలేను. రూ.10.5 లక్షల బిల్లు కట్టేందుకు ఆస్పత్రి యాజమాన్యాన్ని 12 గంటల సమయం అడిగితే యాజమాన్యం అందుకు ఒప్పుకోలేదు. పైగా, రోగికి అమర్చిన ఆక్సీజన్ పైపులు, ఇతర వైద్య పరికరాలు తొలగిస్తామని వారు భయపెట్టారు. వారు ఎంత కఠినాత్ములో!’’ అని పరకాల మరో ట్వీట్ చేశారు.

Related Posts